Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహా సముద్రంట్రైలర్ సిద్ధ‌మైంది - ద‌స‌రాకు సినిమా

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (17:33 IST)
Sharvanand, Siddharth
విభిన్న కథలను ఎంచుకుంటూ తన కంటూ గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం మహా సముద్రం’. సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.
 
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 23న మహా సముద్రం ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. ఇక ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో సిద్దార్థ్, శర్వానంద్ ఇద్దరూ  యాక్షన్ అవతార్‌లో కనిపిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లకు ఇద్దరు హీరోలు రెడీగా ఉన్నట్టు పోస్టర్‌ను చూస్తే అర్థమవుతోంది.
 
దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ అందించిన రెండు పాటలకు  సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌వీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌, కొల్లా అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌.
 
నటీన‌టులు:
శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, జ‌గ‌ప‌తిబాబు, అదితిరావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయేల్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  అజ‌య్ భూప‌తి, ప్రొడ్యూస‌ర్‌: సుంక‌ర్ రామ‌బ్ర‌హ్మం, కో ప్రొడ్యూస‌ర్‌: అజ‌య్ సుంక‌ర‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  కిషోర్ గరిక‌పాటి, మ్యూజిక్‌: చైత‌న్య భ‌ర‌ద్వాజ్‌, సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌, ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ కె.ఎల్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments