Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాములమ్మకు నోటీసులు... శశికళకు సపోర్టు ఎఫెక్టేనా?

మాజీ ఎంపీ, సీనియర్ సినీనటి విజయశాంతికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఆస్తుల విక్రయం కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి.

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (11:21 IST)
మాజీ ఎంపీ, సీనియర్ సినీనటి విజయశాంతికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఆస్తుల విక్రయం కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. నటి విజ‌య‌శాంతి నుంచి తాను కొనుగోలు చేసిన ఆస్తుల‌ను ఆమె మ‌రొక‌రికి విక్ర‌యించారంటూ ఇంద్రచంద్ అనే వ్య‌క్తి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను విచారించిన కోర్టు ఈ నోటీసులు జారీచేసింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే...
 
విజయశాంతి స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో చెన్నైలో నివశిస్తూ వచ్చింది. ఆ సమయంలో ఆమె నగరంలోని పలు ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు. అయితే, విజయశాంతి రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత తన స్థిరాస్తుల్లో కొన్నింటిని విక్రయించారు. ఇందులోభాగంగా, స్థానిక ఎగ్మోర్‌లో ఆమెకు చెందిన స్థిరాస్తిని ఇంద్రచంద్ అనే వ్యక్తికి 2006లో రూ.5.20 కోట్ల‌కు కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన ప‌వ‌రాఫ్ అటార్నీ ప‌త్రాల‌ను కూడా తీసుకుని విజ‌య‌శాంతికి రూ.4.68 కోట్లు అందించారు.
 
అయితే తాను కొనుగోలు చేసిన ఆస్తుల‌ను ఆమె వేరొక‌రికి విక్ర‌యించారంటూ ఇంద్రచంద్ స్థానిక జార్జ్‌టౌన్ కోర్టులో కేసు వేయగా, ఈ కేసును విచారించిన కోర్టు ఆ పిటీషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌పై శ‌నివారం విచారణ జరిపిన కోర్టు.. వివాదాన్ని ఇద్ద‌రూ సామ‌రస్య‌పూర్వ‌కంగా ప‌రిష్కరించుకోవాల‌ని ఆదేశిస్తూ విచార‌ణ‌ను సోమ‌వారం వాయిదా వేసింది. విజ‌య‌శాంతి స్వ‌యంగా కోర్టుకు హాజ‌రు కావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీచేసింది. కాగా, జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే బాధ్యతలు చేపట్టిన శశికళకు విజయశాంతి ఆమెకు మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments