Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న మధురం

డీవీ
శనివారం, 17 ఫిబ్రవరి 2024 (16:29 IST)
Uday Raj - Vaishnavi
ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు.
 
*చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మధురం చిత్రాన్ని చాలా రిచ్ గా  నిర్మించారు.. అన్నారు. 
 
*నిర్మాత యం. బంగార్రాజు మాట్లాడుతూ.."* మా దర్శకుడు రాజేష్ చెప్పిన కథ అధ్భుతంగా నచ్చింది.. కొత్తదనం వున్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.. అలాగే మా "మధురం"  సినిమా కూడా చాలా కొత్తగా నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా వుంటుంది. కచ్చితంగా  చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం మాకు ఉంది. ఇటీవలే మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు.. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయనకి మా కృతజ్ఞతలు.  హైదారాబాద్, పాలకొల్లు, ఆచంట, సిద్ధాంతం, రావులపాలెం, కోనసీమ ఏరియాలో షూటింగ్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి.. మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు.. పాటలన్నీ కూడా కోనసీమ, మారెడుమిల్లి, రంపచోడవరం వంటి సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించాం.. షూటింగ్ అంతా పూర్తి అయింది.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి.. త్వరలోనే  సెన్సార్ పూర్తి చేసి సమ్మర్ లోనే సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తాం అన్నారు. 
 
 *హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ.. "* రీసెంట్ గా నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను.. అలాగే కొన్ని హిట్ మూవీస్ లో మంచి క్యారెక్టర్స్ చేశాను. అవి చూసి డైరెక్టర్ రాజేష్, మా నిర్మాత బంగార్రాజు గారు ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశాన్ని ఇచ్చారు.. వారికి నా థాంక్స్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే టీనేజ్ లవ్ స్టొరీ ఇది. నా క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అయ్యేలా వుంటుంది.. యూత్ కే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చేలా ఈ చిత్రం వుంటుంది.. రీసెంట్ గా మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విశ్వక్ సేన్ గారికి నా స్పెషల్ థాంక్స్.. అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

బోను తాళం పగలగొట్టుకొని మరీ బయటకు వచ్చిన పులి!!

సాక్షి ప్రకటనల రూపంలో అడ్డుగోలుగా రూ.443 కోట్లు దోచిపెట్టారు..

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోం.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments