Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాధవ్, సిమ్రాన్ శ‌ర్మ కెమిస్ట్రీకి తగినట్లు మంగ్లీ పాడిన కావాలయ్యా.. సాంగ్

డీవీ
సోమవారం, 4 నవంబరు 2024 (17:05 IST)
Madhav and Simran Sharma
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా "మిస్టర్ ఇడియ‌ట్‌". ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్  "మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 
 
ఈ రోజు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియా ద్వారా "మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమా నుంచి 'కావాలయ్యా..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. 'కావాలయ్యా..' సాంగ్ కంపోజిషన్, పిక్చరైజేషన్ చాలా బాగుందన్న తమన్..హీరో మాధవ్ తో పాటు ఎంటైర్ మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు.
 
'కావాలయ్యా..' పాటను అనూప్ రూబెన్స్ మంచి బీట్ తో కంపోజ్ చేయగా భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ అందించారు. గాయని మంగ్లీ ఎనర్జిటిక్ గా పాడారు. 'కళ్లల్లోకి కళ్లు పెట్టి అదోలా చూశావయ్యా, మాటల్తోనే మనసుకు మందే పెట్టావయ్యా, తస్సాదియ్యా, తస్సాదియ్యా, పచ్చి పచ్చిగ చెప్పాలంటే పిచ్చిగ ఫిదా అయ్యా, పూవుల్తోటి పొట్లం గట్టి మేరె దిల్ దియా, చూస్కోవయ్యా, తీస్కోవయ్యా, కావాలయ్యా, నువ్వే కావాలయ్యా...' అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments