Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా నటులపై ట్రోల్స్... డీజీపీ ఫిర్యాదు చేసిన 'మా'

సెల్వి
గురువారం, 18 జులై 2024 (17:33 IST)
సోషల్ మీడియా వేదికగా సినీ నటులను లక్ష్యంగా ట్రోల్స్, అసభ్య, అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్‌కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం డీజీపీని కలిసి ఓ వినతి పత్రం సమర్పించారు. సినీ నటులపై ట్రోల్స్ చేస్తున్నందుకుగాను, ఇప్పటికే ఐదు యూట్యూబ్‌ ఛానళ్లను రద్దు చేయగా, మరో 250 యూట్యూబ్‌ ఛానళ్ల జాబితాను డీజీపీకి సమర్పించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మా సభ్యులు కోరారు. 
 
ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన డీజీపీ.. సైబర్‌ సెక్యూరిటీ విభాగం సహకారంతో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి, ట్రోలర్స్‌పై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నటుడు రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ.. విమర్శలు, ట్రోల్స్‌ సరదాగా నవ్వుకునేలా ఉంటే బాగుంటుంది కానీ, వ్యక్తిగత విమర్శలు చేసి, కుటుంబ సభ్యులను కూడా ఏడిపించేలా ఉండరాదన్నారు. డబ్బు కోసం కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు అనుసరిస్తున్న విధానాలు దారుణంగా ఉన్నాయని, ఇలాంటి వాటిని అస్సలు ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments