Webdunia - Bharat's app for daily news and videos

Install App

`మా`కు కాదు నాగ‌బాబుకే మ‌స‌క‌బారింది

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (11:56 IST)
Nagababu-Naresh
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ పోటీ చేస్తూ ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సీనియ‌ర్ న‌టుడు నాగ‌బాబు స్పందించిన తీరుప‌ట్ల సినీప్ర‌ముఖులు పెక్కుమంది ఆక్షేపించారు. ముఖ్యంగా `మా` ప్ర‌స్తుత అధ్య‌క్షుడు సీనియ‌ర్ న‌రేశ్ తీవ్రంగా ఖండించారు. నాగ‌బాబుగారు `మా` నాలుగేళ్ళ‌నుంచి మ‌స‌కబారింద‌ని పేర్కొన‌డం స‌రైందికాద‌ని అన్నారు.అలాగే  సీనియ‌ర్ నిర్మాత‌, న‌టుడు, ఛాంబ‌ర్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్ త్రిపుర‌నేని చిట్టిబాబు కూడా నాగ‌బాబు మాట్లాడిన విధానం స‌రైంది కాద‌ని తేల్చిచెప్పారు.
 
శ‌నివారంనాడు సీనియ‌ర్ న‌రేశ్‌ తాను చేసిన ప‌నుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. నేను మా అధ్య‌క్షుడిగా వున్న‌ప్ప‌టినుంచి చేసిన సేవ‌ల‌ను నాగ‌బాబుకు చెబుతూనే వున్నాను. చాలాసార్లు క‌లిసి విన్న‌వించాం. బాగుంది అన్నారు. కానీ ఇప్పుడు మా మ‌స‌క‌బారింది అన‌డం ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నానంటూ సుతిమెత్తంగా వివ‌ర‌ణ ఇచ్చారు.
 
చిరంజీవిగారే మెచ్చుకున్నారు
క‌రోనా టైంలో ఎంతోమందికి సాయం చేశామంటూ న‌రేశ్‌ వివ‌రాల‌తో స‌హా విలేక‌రుల‌మందు వివ‌రించారు. అందులో చిరంజీవిగారి ఆధ్వ‌ర్యంలో సి.సి.సి ఏర్పాటైన‌ప్పుడు మా`` త‌ర‌ఫున కాకుండా నేను స్వంత‌గా లక్ష విరాళాన్ని అంద‌జేశాను. ఆ రోజు రాత్రి చిరంజీవిగారు ఫోన్ చేసి మీకు చాలా కృత‌జ్ఞ‌త‌లు అంటూ మాట్లాడారు. అలాగే మా చేస్తున్న సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని తెలిపారు. మ‌రి ఇవ‌న్నీ నాగ‌బాబుకూ తెలియ‌వా? అంటూ ప్ర‌శ్నించారు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments