Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు హిట్ పాటల రచయిత గురుచరణ్ కన్నుమూత

ఠాగూర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (13:14 IST)
Gurucharan
తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ గేయ రచయిత గురుచరణ్ కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. ‘ముద్దబంతి పువ్వులో మూగబాసలు’, ‘కుంతీకుమారి తన నోరుజారి’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిలా’ వంటి అనేక సూపర్ హిట్ పాటలను గురుచరణ్ రచించారు. 
 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. గురుచరణ్ అలనాటి ప్రముఖ నటి ఎం.ఆర్.తిలకం, అలనాటి ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల కుమారుడు. ఎం.ఎ. చదివిన గురుచరణ్ ప్రముఖ గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు. రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు. 
 
ముఖ్యంగా నటుడు మోహన్‌బాబుకు ఎంతో ఇష్టమైన పాటల రచయిత గురుచరణ్. మోహన్‌బాబు నటించిన చిత్రాలలో గురుచరణ్‌తో ఒక్క పాట అయినా తప్పకుండా రాయించేవారు. మోహన్ బాబు చిత్రాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్నో మెలోడీ, అర్థవంతమైన పాటలు గురుచరణ్ కలం నుంచి  వచ్చినవే కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments