Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫాఫ్ డు ప్లెసిస్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంటుందా? అకాశో చోప్రా

ipl2022

ఠాగూర్

, గురువారం, 12 సెప్టెంబరు 2024 (12:10 IST)
త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ రిటెన్షన్‌కు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. డిసెంబరు నెలలో మెగా వేలం నిర్వహించనుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. రైట్ టు మ్యాచ్, రిటెన్షన్ పద్ధతిలో ఎంతమంది క్రికెటర్లకు అవకాశం ఇస్తారనే దానిపైనే మెగా వేలం నిర్వహణ ఆధారపడి ఉంటుందని పలువురి విశ్లేషణ. అయితే, ఇప్పటి నుంచే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎవరిని తమ వద్ద అట్టిపెట్టుకోవాలి? ఎవరిని పక్కన పెట్టాలనే దానిపై దృష్టిసారించాయి. 
 
ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆర్సీబీ రిటెన్షన్ విధానంపై విశ్లేషించాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను పక్కన పెట్టడం ఖాయమనే చోప్రా వ్యాఖ్యానించాడు. '40 ఏళ్ల ఫాఫ్ డు ప్లెసిస్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంటుందా? అనేది ఆసక్తికరమే. అత్యంత క్లిష్టమైన ప్రశ్న కూడా ఇదే. మూడేళ్ల కాలానికి రిటైన్ చేసుకొని తమవద్ద ఉంచుకోదని భావిస్తున్నా. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని తప్పకుండా రిటైన్ చేసుకుంటుంది. అతడితోపాటు మహ్మద్ సిరాజ్ ఉంటాడు. భారత బౌలర్‌గా అతడికి అవకాశం ఉంటుంది. 
 
మెగా వేలంలో స్టార్ బౌలర్లు ఉండకపోవచ్చు. నాకే అవకాశం ఉంటే కామెరూన్ గ్రీన్‌ను తీసుకుంటా. అదేవిధంగా రజత్ పటీదార్ కూడా నా జాబితాలో ఉంటాడు. గత ఏడాది దారుణంగా విఫలమైన బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. అతడిని జట్టులోకి తీసుకోవడం దండగేనని నా అభిప్రాయం. మ్యాక్సీని తీసుకోవద్దని ఫ్రాంచైజీకి గట్టిగా చెబుతా. అతడికి బదులు విల్ జాక్స్ చాలా బెటర్. అయితే, ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చే నిబంధనలు బయటకు వస్తే అప్పుడు ఈ సంఖ్యను తగ్గించవచ్చు. లేదా పెంచుకోవచ్చు' అని చోప్రా వెల్లడించాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

147 సంవత్సరాల క్రికెట్ చరిత్ర.. సచిన్ రికార్డుకు 58 పరుగుల దూరంలో కోహ్లీ