Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 13 January 2025
webdunia

కోల్‌కతాకు టాటా చెప్పనున్న యువ బ్యాటర్ రింకూ సింగ్!!

Advertiesment
rinku singh

ఠాగూర్

, మంగళవారం, 20 ఆగస్టు 2024 (10:37 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల్లో ఒకటైన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు యువ బ్యాటర్ రింకూ సింగూ టాటా చెప్పనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకూర్చేలా రింకూ తాజాగా వ్యాఖ్యలు చేశారు. పైగా, రింకూ సింగ్‌ను సొంతం చేసుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు కన్నేసినట్టు సమాచారం. 
 
ఐపీఎల్ 18వ సీజన్ లో రింకూ సింగ్‌పై కోల్‌కతా జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. అయితే, ఐపీఎల్ మెగా వేలానికి ముందే ఈ యువ బ్యాటర్ ఆ ఫ్రాంచైజీకి షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఒకవేళ కేకేఆర్ వచ్చే మెగా వేలంలో తనను వదిలేస్తే.. ఖచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ఆడతానని చెప్పడం అందుకు నిదర్శనం.
 
16వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఆఖరి ఓవరులో ఐదు సిక్స్‌లతో రింకూ ఒక్కసారిగా క్రికెట్ హీరోగా అవతరించిన విషయం తెల్సిందే. ఈ మెరుపు ఇన్నింగ్స్ తర్వాత ఆసియా గేమ్స్ (2023)లో భారత్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, ఐపీఎల్ 17వ సీజన్‌లో ఈ యువ ఆటగాడికి ఛాన్సే లభించలేదు. దానికి తోడు నాలుగైదు ఇన్సింగ్స్ ఆడినా గతంలో మాదిరిగా ఆటను ప్రదర్శించలేకపోయాడు. దీంతో.. ఈ సారి రింకూ సింగ్‌ను కోల్‌కతా వదిలివేస్తుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అతను కూడా కొత్త జట్టుకు మారేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
ప్రస్తుతం వస్తున్న వదంతులపై రింకూ సింగ్ స్పందించారు. తనను కోల్‌కతా అట్టిపెట్టుకుంటుందా? లేదా? మే నెలలో మెగా వేలం జరుగుతుందా? అనేది ఇప్పటికైతే ఏమీ తెలియదని, ఏమి జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించాడు. ఒకవేళ తనను కోల్‌కతా వద్దనుకుంటే మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరపున ఆడుతానని చెప్పుకొచ్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంజీ ట్రోఫీలో ఆడనున్న మహమ్మద్ షమీ