Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ ప్రదీప్ మాచిరాజు లక్కీ ఛాన్స్, ఏంటది?

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (16:44 IST)
యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ఎస్వీ బాబు నిర్మించిన ఈ చిత్రంలో ప్రదీస్ సరసన అమృతా అయ్యర్ నటించింది. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు ఒక దృశ్యకావ్యంగా ఈ సినిమా ఉందని అభినందించినట్లు చిత్ర బృందం తెలియచేసింది. 
 
ఇదిలా ఉంటే... సూపర్‌స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా లాంఛ్ అయిన నీలినీలి ఆకాశం.. అంటూ సాగే పాట సంగీత ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించింది. ఈ పాట యూట్యూబ్‌లో ఇప్పటివరకు 60 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం. 
 
స్టార్ హీరో నటించిన సినిమాలో పాట 60 మిలియన్ వ్యూస్ సాధించింది అంటే.. ఆయా స్టార్ హీరోకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వలన సాధ్యమౌతుంది కానీ.. చిన్న సినిమాలో పాటకు ఈ స్థాయిలో వ్యూస్ వచ్చాయంటే... ఈ పాట ఎంతగా నచ్చేసిందో అర్ధం చేసుకోవచ్చు. 
 
చిన్న సినిమా పాటల్లో ఇదే పెద్ద విజయం.. పెద్ద రికార్డ్ అని చెప్పచ్చు. ఈ పాటకు సాహిత్యం చంద్రబోస్ అందించగా, సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు. దాశరథి శివేంద్ర కెమెరా వర్క్ ఈ పాటకు అద్భుతంగా సెట్ అయ్యింది. సాహిత్యం, సంగీతంతో పాటు అద్భుతమైన సినిమాటోగ్రఫీ కూడా తోడవ్వడంతో ఈ పాట ఈ స్థాయి విజయాన్ని సాధించిందని చెప్పచ్చు.
 
 
 
ఈ సినిమాలోని పాటే ఇంత అద్భుతంగా ఉంటే.. సినిమా ఇంకెంత అద్భుతంగా ఉంటుంది.? అసలు.. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? ఈ సినిమా ద్వారా ఏం చెప్పనున్నారు.? ఇలా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో ప్రశ్నలు. ఈ ప్రశ్నలు అన్నింటికి ఈ సినిమానే సమాధానం చెబుతుంది అంటున్నారు చిత్ర యూనిట్. నీలి నీలి ఆకాశం.. సాంగ్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాని తమ ఏరియాల్లో మేము రిలీజ్ చేస్తామంటే.. మేము రిలీజ్ చేస్తామని.. డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వచ్చారని తెలిసింది. 
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు జీఏ2, యు.వి. క్రియేషన్స్ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. సినిమా బాగుంటేనే ఈ సంస్థలు రిలీజ్ చేయడానికి ముందుకు వస్తుంటాయి. ఈ సినిమాని ఈ రెండు పెద్ద సంస్థలు కలిసి రిలీజ్ చేస్తున్నాయంటే... ప్రదీప్ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే.
 
ఈ చిత్రంలో హీరో ప్రదీప్ రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కొత్తగా కనిపిస్తారని.... ఆ రెండు పాత్రల్లో ఆయన నటన ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉండి అలరిస్తాయి అని డైరెక్టర్ తెలియచేసారు. 
 
అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయని.. దర్శకునికి ఇది తొలి సినిమా అయినప్పటికీ ఒక దృశ్య కావ్యంలా చిత్రాన్ని రూపొందించారు. లవ్ ఎంటర్టైనర్‌గా సినిమా అలరిస్తుంది. ఈ విభిన్న ప్రేమకథా చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాత తెలియచేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments