Webdunia - Bharat's app for daily news and videos

Install App

50మిలియ‌న్స్‌కి పైగా చేరుకున్న ల‌వ్‌లీ హిందీ వెర్ష‌న్ `విజ‌య్ మేరీ హై`

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (18:30 IST)
Sanvi, BARaju, Achi reddy, Adi
ఆదిసాయికుమార్‌, శాన్వీ హీరోహీరోయిన్లుగా బి. జ‌య ద‌ర్శక‌త్వంలో రూపొందిన చిత్రం`ల‌వ్‌లీ`. ల‌వ్అండ్‌మ్యూజిక‌ల్ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్నిఆర్‌జే సినిమాస్ బేన‌ర్‌పై బి.ఎ.రాజు నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుత‌మైన విజ‌యం సాధించ‌డంతో పాటు న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రి కెరీర్‌లో ఒక మొమ‌ర‌బుల్ మూవీగా నిలిచింది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీలోని అన్ని పాట‌లు ఇప్ప‌టికీ మంచి ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్నాయి. ఈ మూవీ హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ `విజ‌య్ మేరీహై`కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. తాజాగా `విజ‌య్ మేరీహై` సినిమా 50మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్ సాధించింది. 
 
ఈ సంద‌ర్భంగా ఆదిసాయికుమార్ మాట్లాడుతూ, ``ప్రేమ‌కావాలి` త‌ర్వాత నా కెరీర్‌లో మ‌రో మొమ‌ర‌బుల్ మూవీ `ల‌వ్‌లీ`. క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా బిగ్ స‌క్సెస్ సాధించింది. ద‌ర్శ‌కురాలు జ‌య‌గారు అద్భుత‌మైన క‌థా-క‌థ‌నంతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించేలా ఈ  చిత్రాన్ని తెర‌కెక్కించారు. ల‌వ్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్, డైలాగ్స్ ఇలా అన్నిచ‌క్క‌గా కుదిరాయి. న‌టుడిగా న‌న్ను మ‌రో లెవ‌ల్‌కి తీసుకెళ్లిన సినిమా ల‌వ్‌లీ. అనూప్‌గారు ఎవ‌ర్‌గ్రీన్ ఆల్బ‌మ్ ఇచ్చారు. ఇప్ప‌టికీ ఆ పాట‌ల‌ను ఎంజాయ్‌చేస్తుంటాను. బి.ఎ.రాజుగారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్‌కాకుండా అత్య‌ద్భుతంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ల‌వ్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్  అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ తీసిన ల‌వ్‌లీ  హీందీ వెర్ష‌న్  `విజ‌య్ మేరీహై` 50మిలియ‌న్ల మార్క్‌ను చేరుకోవ‌డం చాలా హ్యాపీగా ఉంది``అన్నారు.
 
నిర్మాత బి.ఎ.రాజు, హీరోయిన్ శాన్వీ, సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్‌ మాట్లాడుతూ, ``ఈ చిత్రం హిందీలో 50 మిలియ‌న్ల మార్క్ క్రాస్ చేయ‌డం హ్యాపీగా ఉంది. ఈ చిత్రాన్ని హిందీలో డ‌బ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్ వారికి విజ‌యాభినంద‌న‌లు తెలిపారు.

సంబంధిత వార్తలు

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments