Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబాలి ఫీవర్... అమెరికాలో సినిమా చూసిన రజినీకాంత్... కబాలికి 'లింగా' లిటికేషన్....

కబాలి ఫీవర్‌తో ఊగిపోతున్న రజినీ అభిమానులకు కాస్త చేదుగా అనిపించే వార్తే ఇది. కబాలి షెడ్యూల్ ప్రకారం శుక్రవారం విడుదల అవ్వాలి. అయితే ఆ సినిమాను విడుదల చేయకుండా ఆపాలంటూ ఓ వ్యక్తి చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన సుక్ర ఫిలిమ్స్ భాగస్వామి ఆర్.మహాప్ర

Webdunia
గురువారం, 21 జులై 2016 (12:51 IST)
కబాలి ఫీవర్‌తో ఊగిపోతున్న రజినీ అభిమానులకు కాస్త చేదుగా అనిపించే వార్తే ఇది. కబాలి షెడ్యూల్ ప్రకారం శుక్రవారం విడుదల అవ్వాలి. అయితే ఆ సినిమాను విడుదల చేయకుండా ఆపాలంటూ ఓ వ్యక్తి చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన సుక్ర ఫిలిమ్స్ భాగస్వామి ఆర్.మహాప్రభు. గతంలో రజినీ చేసిన లింగా సినిమాను పంపిణీ చేశారు. 
 
లింగా సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా వల్ల తాను ఆర్థికంగా చాలా నష్టపోయానని, ఆ చిత్ర నిర్మాత వెంకటేశ్, రజినీకాంత్ నష్టపోయిన మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చారని ప్రభు పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇంకా తనకు రూ.89 లక్షలు రావాల్సి ఉందని... ఆ బాకీ తీర్చాకే కబాలి విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. 
 
ఈ పిటిషన్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. గురువారం దీనిపై విచారణ చేయనుంది. హీరో రజినీకి, కబాలి నిర్మాత థానుకి నోటీసులు పంపింది. కబాలి విడుదల అవుతుందో లేదో నేడు తేలిపోతుంది. కాగా కబాలి చిత్రాన్ని రజినీకాంత్, తన కుమార్తెతో కలిసి అమెరికాలో ప్రివ్యూ సినిమాను వీక్షించారు. వాళ్ల రియాక్షన్ మాత్రం చెప్పలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments