అనుష్క శెట్టి సోదరుడికి బెదిరింపులు- గుణ రంజన్‌ని హత్యకు కుట్ర?

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (10:17 IST)
దక్షిణాదిన బాహుబలి హీరోయిన్ అనుష్కకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సౌత్‌లో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ తెచ్చుకుంది అనుష్క శెట్టి. కానీ అనుష్క బాహుబలి తర్వాత అంత యాక్టివ్‌గా లేదు. బాహుబలి 2 తర్వాత అనుష్క పూర్తి స్థాయిలో నటించిన చిత్రం రెండు మాత్రమే. అవి భాగమతి ఒకటి కాగా.. మరొకటి ఇటీవల విడుదలైన నిశ్శబ్దం.  
 
ప్రస్తుతం అనుష్క తన ఫ్యామిలీతో సమయం గడుపుతోంది. దీనితో అనుష్క పెళ్లి గురించి ఊహాగానాలు వినిపించాయి. అయితే తన పెళ్లి ఇప్పట్లో లేదు అన్నట్లుగా అనుష్క యువీ క్రియోషన్ బ్యానర్‌లో మరో చిత్రానికి కమిటైంది. 
 
ఇది పక్కన పెడితే అనుష్క ఫ్యామిలీ గురించి షాకింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. అనుష్క సోదరుడు గుణరంజన్ శెట్టి గ్యాంగ్ స్టర్స్ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
గునరంజన్ శెట్టికి మాఫియా గ్యాంగ్ స్టర్స్‌తో సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్యాంగ్ స్టర్ ముత్తరప్పై బ్రతికి ఉండగా.. మాన్విత్‌రై అనే వ్యక్తి, గుణరంజన్ ఇద్దరూ ఆయనకు అనుచరులుగా ఉండేవారు. 
 
వీరిద్దరూ ఆయనకు కుడి ఎడమ భుజాలు అని చెబుతుంటారు. ముత్తరప్పైమరణం తర్వాత మాన్విత్ రై , గుణ రంజన్ మధ్య విభేదాలు మొదలై విడిపోయారు. 
 
ముత్తప్పరై స్థాపించిన జయ కర్ణాటక సంఘం గుణ రంజన్ విభేదాల కారణంగా బయటకి వచ్చేశాడు. ఆ తర్వాత గుణ రంజన్ సొంతంగా జయ కర్ణాటక జనపర వేదికని స్థాపించారు.
 
దీనితో ముత్తప్పరైలో అసూయ పెరిగిందని.. గుణ రంజన్‌ని హత్య చేసేందుకు ముత్తరప్పై కుట్ర చేస్తున్నారని.. గుణ రంజన్ అనుచరులు ఆరోపిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TTD: 50 ఎకరాల్లో వసతి భవనాలు, 25 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తాం

Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)

Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)

జగన్ టూర్-పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కేసు

ట్రంప్‌కు వర్జీనియా ప్రజలు వాత, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన మలక్ పేట మహిళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments