Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

దేవీ
శనివారం, 10 మే 2025 (14:29 IST)
Nani, deepti, sesh and others
నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్  HIT: ది 3rd కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.  మే 1న పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ అయిన HIT: The 3rd Case అందరినీ ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది . ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీటింగ్ నిర్వహించారు.
 
నాని మాట్లాడుతూ.. ఈ సక్సెస్ సెలబ్రేషన్ గురించి డిస్కస్ వచ్చినప్పుడు దేశంలో పరిస్థితి సెన్సిటివ్ గా ఉంది కదా సెలబ్రేషన్స్ చేయొచ్చా అనే చర్చ వచ్చింది. శత్రువులు మనకి ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ప్రయత్నించారు. దానికి  మన దేశం, సైన్యం చాలా హుందాగా బదులు చెప్పింది. వాళ్లు చేసిన పని వల్ల ఇండియాలో ఒకచోట సక్సెస్ సెలబ్రేషన్ క్యాన్సిల్ అయిందని ఒక సాటిస్ఫాక్షన్ కూడా వాళ్లకి ఇవ్వకూడదని ఉద్దేశంతో ఈ సెలబ్రేషన్ చేయడం జరిగింది. మనల్ని ఏమీ చేయలేకపోయారని స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. లెట్స్ సెలబ్రేట్.. లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ. సైన్యంలో ఉన్న అందరికీ నా, మా టీం తరపునుంచి ఏ బిగ్ సెల్యూట్. 
 
నా ఫేవరెట్ ఫిలిం జగదేకవీరుడు అతిలోకసుందరి రీరిలీజ్ అయింది. హిట్3  సక్సెస్ సెలబ్రేషన్ జరుగుతోంది. శ్రీ విష్ణు సింగిల్ సినిమా రిలీజ్ అయింది. శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ కామెడీ చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను.అలాగే సమంత శుభం సినిమా గురించి కూడా చాలా మంచి రిపోర్ట్స్ వింటున్నాను అన్ని సినిమాలు అద్భుతంగా ఆడాలి. ఇండస్ట్రీ బాగుండాలి. ఈ సినిమా సందడి థియేటర్స్ లో ఎనర్జీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి శేష్ కి నాకు మధ్య ఒక మంచి అనుబంధ ఉంది. హిట్2 తో అది మరింత పెరిగింది. ఇప్పుడు మా ఇద్దరినీ స్క్రీన్ మీద చూడడం పర్సనల్ గా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. 2025 అటు కోర్ట్ ఇట హిట్ 3.. వెరీ మెమరబుల్ ఇయర్. 2026 దీన్ని మించి ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తాం. థాంక్యూ సో మచ్'అన్నారు.
 
హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ముందుగా మన దేశం కోసం మన సైనికులు పోరాడుతున్న  విధానం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. వాళ్లు గర్వపడేలా మనం జీవించాలి అనిపించింది. ఈ సెలబ్రేషన్స్ గురించి నానికి అడిగినప్పుడు ప్రభుత్వం మనకి అండగా ఉంది సైన్యం మనల్ని రక్షిస్తుంది అంతా నార్మల్ గా ఉండాలి, ఆ సందేశాన్ని జనాల్లోకి పంపిద్దాం అని అన్నారు ఆ మాట నాకు చాలా నచ్చింది. సినిమా విషయానికొస్తే హిట్3 ఆడియన్స్ అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. అర్జున్ సర్కార్ మృదుల ఫెంటాస్టిక్ గా ఉన్నారు. సినిమా ధియేటర్లో  మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. నా చిన్న అపీరియన్స్ కి చాలా మంచి కాంప్లిమెంట్స్ రావడం హ్యాపీగా అనిపించింది. త్వరలోనే మీ అందరిని థియేటర్స్ లో కలవాలని చూస్తున్నాను. అప్పటివరకు హిట్ 3 వైబ్ ని ఎంజాయ్ చేద్దాం' అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments