Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

Advertiesment
Dil Raju, Nani, Prashanthi, Sailesh Kolanu

దేవీ

, గురువారం, 1 మే 2025 (18:21 IST)
Dil Raju, Nani, Prashanthi, Sailesh Kolanu
నేచురల్ స్టార్ నాని నటించిన  HIT: ది 3rd కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. హ్యుజ్ బజ్, ట్రెమండస్ బుకింగ్స్ తో మే 1న పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ అయిన HIT: The 3rd Case అందరినీ ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొంది. 
 
ఈ సందర్భంగా గురువారంనాడు నాని మాట్లాడుతూ, ఇది ఒక అద్భుతమైన రిలీజ్ డే. పొద్దున లేచి చూస్తే నా ఫోను మెసేజ్లతో నిండిపోయింది. ఇండస్ట్రీ, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ సినిమా గురించి అద్భుతంగా చెబుతున్నారు. చాలా రిలీజ్ డేస్ చూసాను.  కానీ ఈ రిలీజ్ డేట్ వైబ్ అదిరిపోయింది. సినిమా బుకింగ్స్ అదిరిపోయాయి.. సినిమా సూపర్ హిట్.. ఇవన్నీ పక్కన పెడితే ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ హిట్ 3 జర్నీ.. ఈరోజు నుంచి ప్రతి రోజు కూడా ఒక సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది. ఇది ఎక్కడికెళ్లి ల్యాండ్ అవుతుందనేది మా టీంఅంచనాలకి అందడం లేదు. అందుకే ఎలాంటి స్టేట్మెంటు ఇవ్వదల్చుకోలేదు. 
 
మీ అందరి ప్రేమని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఇది ఇప్పుడిప్పుడే ఆగదు. ఈ సినిమాకి కనీసం నాలుగైదు సెలబ్రేషన్స్ చేయాలి. ఈసారి నేను ప్రొడ్యూసర్ కూడా కాబట్టి ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రతిసారి నాకు ఒక నమ్మకం ఉంటుంది. నేను మీరు ఒకటేనని నమ్మిన ప్రతిసారి మీరు నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరుపేరునా థాంక్యూ సో మచ్. సినిమాని ఇంత అద్భుతంగా సపోర్ట్ చేసి మీడియాకి థాంక్యూ సో మచ్. మీ సపోర్ట్ వలనే ఈ బ్లాక్ బస్టర్ సాధ్యమైంది. మే ఫస్ట్ స్టార్ట్ అయింది. మే అంత ఇది సెలబ్రేషన్స్ లాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాత్రికి అమెరికా వెళుతున్నాను. నాలుగైదు రోజులు అందుబాటులో ఉండను. వచ్చిన వెంటనే మీ అందరిని కలుసుకొని గ్రాండ్ గా సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుందాం. శైలేష్ విషయంలో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఇది తన విజన్ కి ఒక టీజర్ ట్రైలర్ మాత్రమే. మాకు ఎప్పుడూ సపోర్ట్ చేసే దిల్ రాజు గారికి థాంక్యూ సో మచ్. టికెట్ విషయంలో సపోర్ట్ చేసిన ఏపీ గవర్నమెంట్, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కృతజ్ఞతలు. ఇది తెలుగు సినిమా సక్సెస్. రాబోయే సినిమాలు కూడా ఇదే సక్సెస్ ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులందరు ప్రతి సినిమాని ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్
 
నిర్మాత దిల్ రాజ్ మాట్లాడుతూ నిర్మాత.. మే1న మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రీతింగ్ తీసుకుంది. లాస్ట్ మంత్ అంతా సినిమాలో వస్తున్నాయి కానీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడం లేదు, సమ్మర్  అయిపోతుంది అనుకుంటున్న తరుణం. ఏప్రిల్ నెలలో సరైన సినిమాలు లేక చాలా సింగిల్ స్క్రీన్స్ ఏపీ తెలంగాణలో క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి సమయంలో మా హోప్స్ అన్నీ కూడా హిట్ 3  సినిమా మీదే ఉన్నాయి.ఆడియన్స్ సినిమాకి ఏ రేంజ్ లో ఫుల్స్ ఇస్తారని బ్రీతింగ్ హోల్డ్ చేసుకుని  ఉన్నాము. అలాంటిది ఈ సినిమాకి మూడు రోజులు ముందుగానే ఆన్లైన్ బుకింగ్ చూసి జనాలు థియేటర్స్ కి వస్తున్నారని హ్యాపీగా ఫీలయ్యా. ఈ సినిమాకి ఎక్కడ చూసినా యునానమస్ గా లాస్ట్ హాఫ్ అండ్ అవర్ ఎక్స్ట్రార్డినరీ అనే మాట వినిపిస్తుంది. సినిమా అదిరిపోయింది. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. ట్రెమండస్ ఓపెనింగ్స్ వచ్చాయి. నానికి ఓవర్సీస్ దసరా హైయెస్ట్ ఉండే ఈ సినిమా క్రాస్ చేసింది. నానికి అక్కడ ఓవర్సీస్ హైయెస్ట్ గ్రాఫర్ అయ్యింది. అలాగే తెలంగాణలో కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నానికి డే వన్ కలెక్షన్ హైయెస్ట్ కాబోతుంది. నాని థాంక్యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్ గా సూపర్ హిట్ ఇచ్చావు. ఈరోజు ప్రొడ్యూసర్ కం హీరోగా సూపర్ హిట్ ఇచ్చావు. శైలేష్ నాని కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్  కంగ్రాట్యులేషన్స్. ఆడియన్స్ మంచి సినిమా ఇస్తే చూడ్డానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్లీ మాకు ఎనర్జీ ఇచ్చారు. డెఫినెట్గ మా వంతు కూడా బాధ్యత ఉంది. ఎప్పటికప్పుడు మీకు కొత్త సినిమాలు ఇచ్చి మీ మిమల్ని థియేటర్స్ కి తీసుకు రావడానికి ఆలోచిస్తున్నాము. అందరికీ థాంక్యు వెరీ మచ్.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య