రూ.వెయ్యి కోట్ల క్లబ్ దిశగా విజయ్ 'లియో'

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2023 (13:35 IST)
కోలీవుడ్ అగ్రహీరో విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం "లియో". ఈ నెల 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. లోకేశ్ కనకరాజ్ దర్శకుడు. సెవెన్  స్క్రీన్ స్టూడియో బ్యానరుపై నిర్మాత ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తొలి నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.400 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఆది, సోమవారాల కలెక్షన్లను బహిర్గతం చేయాల్సివుంది. 
 
ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లోనేకాకుండా అటు ఉత్తరాదిలో కూడా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అలాగే, ఓవర్సీస్‌‍నూ 'లియో'సత్తా చాటింది. దీంతో పాత రికార్డులను తిరగరాస్తూ కలెక్షన్ల పరంగా దూసుకెళుతుంది. 
 
ప్రపంచ వ్యాప్తంగా తొలి నాలుగు రోజుల్లో రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింద. సోమవారం, మంగళవారాల్లో వసూలైన వివరాలు తెలియాల్సివుంది. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం వరకు ఈ సినిమా జోరు కొనసాగే అవకాశం ఉంది. ఆ ప్రకారంగా వచ్చే ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్క్‌ను టచ్ చేసే అవకాశం ఉంది. అయితే నిర్మాత లలిత్ కుమార్ మాత్రం లియో ఖచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయలను టచ్ చేస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. 
 
తమిళనాటు ఓవర్సీస్‌లోనూ విజయ్‌కి గల క్రేజ్‌, లోకేశ్ కనకరాజ్‌కి గల ఇమేజ్‌ను బట్టి చూస్తే ఈ అంచనాలను అందుకోవడం అంత పెద్ద కష్టమేమీ కాదని అభిమానుల అభిప్రాయంగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయలను వసూలు చేస్తుందా లేదా అన్నదే కోలీవుడ్‌లో టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)

కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?

అల్బేనియా ఏఐ మంత్రి డియోల్లా గర్భం దాల్చింది.. 83 మంది ఏఐ పిల్లలు పుట్టబోతున్నారట! (video)

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

Cyclone Montha: 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments