Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి కన్నుమూత... మిస్ యూ సర్-పవన్, భారతీయ సినీ ఇండస్ట్రీకి లోటు-రజినీకాంత్

దర్శకరత్న దాసరి నారాయణ రావు స్వర్గస్తులయ్యారని తెలిసి ఇండియన్ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. నటీనటులు తమ ప్రగాఢ సానుభూతిని, శ్రద్ధాంజలిని తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ : మిస్ యూ సర్. రజినీక

Webdunia
మంగళవారం, 30 మే 2017 (21:17 IST)
దర్శకరత్న దాసరి నారాయణ రావు స్వర్గస్తులయ్యారని తెలిసి ఇండియన్ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. నటీనటులు తమ ప్రగాఢ సానుభూతిని, శ్రద్ధాంజలిని తెలియజేస్తున్నారు.
 
పవన్ కళ్యాణ్ : మిస్ యూ సర్.
 
రజినీకాంత్: నా ప్రియమిత్రుడు, శ్రేయోభిలాషి. భారతదేశ గొప్ప సినీ దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయన మరణం యావత్ భారతీయ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా.
 
కమల్ హాసన్: దాసరి మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
 
జూనియర్ ఎన్టీఆర్: తెలుగు చిత్ర కళామతల్లి కన్న ఒక దిగ్గజం ఇక లేరు. మరువదు ఈ పరిశ్రమ మీ సేవలను.
 
దర్శకరత్న దాసరి నారాయణ రావు మంగళవారం నాడు కిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసారు. ఆయన వయసు 75 ఏళ్లు. ఈ నెల 18వ తేదీన అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, మంగళవారం దాసరి ఆరోగ్యం హఠాత్తుగా బాగా క్షీణించింది. గ‌డిచిన ఐదు నెల‌ల్లో దాస‌రి నారాయ‌ణ రావు 2, 3 సార్లు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవ‌ల ఆయన త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల స‌మ‌యంలో కూడా ఉత్సాహంగానే క‌నిపించారు. 
 
కాగా దాసరి స్వర్గం-నరకం చిత్రానికి స్వర్ణ నందిని అందుకున్నారు. కేంద్ర బొగ్గు-గనుల శాఖామంత్రిగా కూడా పనిచేశారు. 1942 మే నెల 4వ తేదీన తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన దాసరి నారాయణ రావు తొలి సినిమా తాతా మనవడు. మేఘసందేశం చిత్రానికి ఆయన ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. ఎన్టీఆర్‌తో బొబ్బిలి పులి, ఎఎన్నార్ తో ప్రేమాభిషేకం వంటి హిట్ చిత్రాలు ఆయన దర్శకత్వంలోనే వచ్చాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సంధ్య థియేటర్ తొక్కిసలాట : సీన్ రీకన్‌స్ట్రక్షన్ యోచనలో పోలీసులు...

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసు : వెలుగులోకి నమ్మలేని నిజాలు ఎన్నెన్నో?

Allu Arjun చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్.. టెన్షన్ టెన్షన్ (video)

నేటి నుంచి పులివెందులలో జగన్ పర్యటన.. 25న క్రిస్మస్ వేడుకలు

ఇకపై 5, 8 తరగతుల్లో తప్పనిసరి ఉత్తీర్ణత : కేంద్ర స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments