Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌టుడు సుమన్‌కు లెజెండ్ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్

Webdunia
సోమవారం, 12 జులై 2021 (14:11 IST)
నటుడు సుమన్‌ను లెజెండ్ దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం వరించింది. ముంబయిలో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో దక్షిణాది నుంచి సుమన్‌ ఈ పురస్కారం అందుకున్నారు. దాదా సాహెబ్ మనవడు చంద్రశేఖర్ అవార్డు ప్రదానం చేశారు.

నటుడిగా తన ఎదుగుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా సుమన్‌ కృతజ్ఞతలు చెప్పారు. కర్ణాటకకు చెందిన సుమన్‌ యాక్షన్‌ హీరోగా సినిమా తెరకు పరిచమయ్యారు. అన్నమయ్యలో ‘వేంకటేశ్వరస్వామి’ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ తర్వాత ‘శ్రీరామదాసు’లో రాముడిగా కనిపించిన ఆయన భక్తిరస పాత్రలు పోషించడంలో తన సత్తా ఏంటో నిరూపించారు.

రజనీకాంత్‌ కథానాయకుడిగా వచ్చిన ‘శివాజీ’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించి విలన్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ప్రస్తుతం కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తూ వస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎలాగంటే?

Apsara Case: అప్సర హత్య కేసు.. పూజారికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు ఇవే... మంత్రి నాదెండ్ల

హామీ నెరవేరింది .. సంతోషంగా ఉంది.. మాట నిలబెట్టుకున్నా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments