Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా ఎన్నికలు.. భారతదేశంలో పుట్టిన పౌరులందరూ లోకలే..?

Advertiesment
Actor
, శనివారం, 3 జులై 2021 (09:45 IST)
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా నాన్ లోకల్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఎప్పుడు లేనంతగా ఈ సారి అధ్యక్ష పదవీకి పోటీ పెరిగింది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమలతో పాటు సీవీఎల్‌ నరసింహారావు అధ్యక్ష రేసులో ఉన్నామని ప్రకటించారు. ఎలక్షన్‌ డేట్‌ రాకముందే ఫిల్మ్‌ సర్కిల్‌ ప్రచారాలు ఊపందుకున్నాయి. తమ ప్రత్యర్థులపై ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
 
ఇక అధ్యక్ష బరిలో ప్రకాశ్‌ రాజ్‌ నిలబడుతుండడంతో లోకల్‌, నాన్‌ లోకల్‌ నినాదం తెరపైకి వచ్చింది. ప్రకాశ్‌ రాజ్‌ నాన్‌ లోకల్‌ అని కొందరు ఆరోపించడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సుమన్‌ స్పందిస్తూ.. భారతదేశంలో పుట్టిన పౌరులందరూ లోకలేనని చెప్పారు. 
 
లోకల్‌-నాన్‌లోకల్‌ అనే వ్యవహారం గురించి ప్రస్తావించడం అర్థరహితమని ఆయన అన్నారు. అలాగే వైద్యులు, రైతులు నాన్‌లోకల్ అనుకుంటే ప్రజలకు చికిత్స, ఆహారం అందదంటూ పరోక్షంగా ప్రకాశ్‌ రాజ్‌కి ఆయన మద్దతు ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్లాక్ బోర్డ్ అంటూ అపహాస్యం.. దర్శకులకు కమిట్‏మెంట్స్ ఇస్తున్నానట!?