Webdunia - Bharat's app for daily news and videos

Install App

లీలమ్మో నాకు ఎంతో ఇష్టమైన పాట అన్న శ్రీలీల

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (12:34 IST)
Vaishnav Tej, Srileela
మాస్ ప్రేక్షకులకు, అభిమానులకు సరికొత్త ట్రీట్ ని ఇవ్వడానికి ప్రముఖ నటీనటుల పేర్లను పాటల సాహిత్యంలో ఉపయోగించడం చూస్తుంటాం. ఇప్పుడు 'ఆదికేశవ' చిత్ర బృందం కూడా అదే ట్రెండ్‌ ని ఫాలో అవుతూ మాస్ మెచ్చే 'లీలమ్మో' అంటూ సాగే మూడో పాటను విడుదల చేసింది.

పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న 'ఆదికేశవ' నుంచి 'లీలమ్మో' అనే మాస్ పాట విడుదల అయింది. ఈ సందర్భంగా కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. "ప్రతిరోజూ సెట్ కళకళలాడుతూ ఉండేది. శ్రీలీల, సుదర్శన్ గారు సెట్ కి వస్తే ఇంకా ఎక్కువ కళకళలాడేది. షూటింగ్ అంతా ఎంతో సరదాగా జరిగింది." అన్నారు.

కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ.. "ఇప్పుడే అమ్మవారి దసరా అయింది. నవంబర్ 10న శివుడి పేరుతో మా 'ఆదికేశవ' వస్తుంది. 'లీలమ్మో' నాకు ఎంతో ఇష్టమైన పాట. పైగా నా పేరుతో ఉన్న మొదటి పాట. అందుకే ఇది నాకు మరింత ప్రత్యేకమైన పాట. ఈ సాంగ్ మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. వైష్ణవ్ గారు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఇది పర్ఫెక్ట్ మాస్ సాంగ్. పాట వినగానే నాకు స్నేక్ డ్యాన్స్ చేయాలి అనిపించింది. అంతా బాగుంటుంది ఈ పాట" అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. "ప్రథమార్థం అంతా వైష్ణవ్ గారు, శ్రీలీల గారు, సుదర్శన్ గారితో ఎంతో సరదాగా సాగిపోతుంది. ఫస్టాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్, సెకండాఫ్ లో యాక్షన్ ఉంటుంది. ప్రేక్షకులను ఈ సినిమాఖచ్చితంగా అలరిస్తుంది" అన్నారు.

'ఉప్పెన' వంటి బ్లాక్‌బస్టర్‌తో అరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్ తేజ్.. విభిన్న సినిమాలు, పాత్రలతో వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు 'ఆదికేశవ' అనే మాస్ యాక్షన్‌ సినిమాతో రాబోతున్నారు.

శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ ప‌తాకాల‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీస్థాయిలో ఆదికేశవ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెరుపు వేగంతో రోడ్డుపై యువకుడిని ఢీకొట్టిన బైక్, నడిపే వ్యక్తి మృతి (Video)

సకల వర్గాల ప్రజల మేలు కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూర్యారాధన

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments