Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్‌తో లారెన్స్ మూవీ చేస్తున్నాడా?

Webdunia
మంగళవారం, 12 మే 2020 (22:11 IST)
రాఘవ లారెన్స్.. ఈ పేరు చెబితే చాలు మాస్‌కి మాంచి ఊపు వస్తుంది. డ్యాన్స్ ఎంత బాగా చేస్తాడో... యాక్టింగ్ కూడా అంతే బాగా చేస్తాడు. కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఇలా తను ప్రవేశించిన ప్రతి శాఖలో సక్సస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. టాలీవుడ్ కింగ్ నాగార్జున.. లారెన్స్‌కి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. 
 
తొలి ప్రయత్నంతోనే ఘన విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత తెలుగులో స్టైల్, డాన్, రెబల్.. ఇలా విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించి మాస్‌ని మెప్పించాడు. ఆ తర్వాత నుంచి ముని, కాంచన, కాంచన 2, కాంచన 3... ఇలా... వరుసగా హర్రర్ మూవీస్ తెరకెక్కిస్తూ... బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ సాధిస్తూ వరుసగా విజయాలు సాధిస్తున్నాడు. 
 
అయితే... వరుసగా హర్రర్ మూవీస్ చేస్తుండటంతో లారెన్స్ హర్రర్ తప్పా... కమర్షియల్ మూవీస్ తెరకెక్కించలేడు అనే విమర్శలను ఎదుర్కొంటున్నాడు కోలీవుడ్లో. అందుకనే... ఆ విమర్శలకు సమాధానం చెప్పడం కోసమే... స్టార్ హీరో విజయ్‌తో సినిమా ప్లాన్ చేసాడని తెలిసింది. విజయ్ ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
 
ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత లారెన్స్‌తో విజయ్ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం లారెన్స్ విజయ్‌కి కరెక్ట్‌గా సరిపోయే కథ రెడీ చేస్తున్నాడని సమాచారం. విజయ్‌కి మాస్‌లో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ఇక లారెన్స్‌కి కూడా మాస్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇక ఇద్దరూ కలిస్తే.. ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. త్వరలోనే అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments