Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళంటూ చేసుకోను.. కానీ ఓ వ్యక్తి మాత్రం?: లక్ష్మీమీనన్

వివాహబంధంపై తనకు నమ్మకంలేదని.. పెళ్లంటూ చేసుకోనని.. అయితే తన జీవితంలో ఓ వ్యక్తి వుంటాడని సినీనటి లక్ష్మీమీనన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 15 ఏళ్ల వయస్సులోనే సినీ రంగంలో అడుగుపెట్టి.. సక్సెస్‌ఫుల్ హీరోయిన

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (14:26 IST)
వివాహబంధంపై తనకు నమ్మకంలేదని.. పెళ్లంటూ చేసుకోనని.. అయితే తన జీవితంలో ఓ వ్యక్తి వుంటాడని సినీనటి లక్ష్మీమీనన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 15 ఏళ్ల వయస్సులోనే సినీ రంగంలో అడుగుపెట్టి.. సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తున్న కోలీవుడ్ చిన్నది లక్ష్మీమీనన్.. వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. 
 
పెళ్లి చేసుకోనంతమాత్రాన, తన జీవితంలో అండగా ఎవరూ ఉండరని అనుకోవద్దని లక్ష్మీమీనన్ వెల్లడించింది. ఇంకా తన జీవితంలో కచ్చితంగా ఒకరు ఉంటారని... అతనికి చాలా నమ్మకం, ప్రేమాభిమానాలు ఉండాలని లక్ష్మీమీనన్ వెల్లడించింది. 
 
అయితే, దాన్ని సహజీవనం అని కూడా చెప్పలేనని.. దాన్ని ఎలా వర్ణించాలో తనకు అర్థం కావడం లేదని చెప్పింది. పెళ్లి చేసుకుంటేనే ప్రేమ, అభిమానం లభిస్తాయని తాను భావించడం లేదని, పెళ్లి చేసుకోకపైనా వాటిని పొందవచ్చునని లక్ష్మీమీనన్ చెప్పుకొచ్చింది. 
 
తమిళంలో ''కుమ్కీ'' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన లక్ష్మీమీనన్.. 15ఏళ్లలోనే సినీ అరంగేట్రం చేసింది. ఈమె విశాల్, విజయ్ సేతుపతి, జయం రవి, కార్తీ వంటి అగ్రహీరోల సరసన నటించింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా వున్న ఈమె కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా సరసన ''జంగ్ మంగ్ చంగ్'' అనే చిత్రంలో నటిస్తోంది. 
 
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో లక్ష్మీమీనన్ పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాను వివాహం చేసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. వివాహం చేసుకోవడం ద్వారానే కాదు.. వివాహం చేసుకోకుండానే ప్రేమను పొందే వ్యక్తి కోసం అన్వేషిస్తున్నట్లు లక్ష్మీమీనన్ తెలిపింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

ప్రపంచ వారసత్వ ప్రదేశాల తుది జాబితాలో లేపాక్షి, గండికోట చేర్చాలి

హెచ్ఐవీ సోకిన మైనర్ బాలికపై అత్యాచారం..

Chandrababu Naidu: కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాను.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments