Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనీప్లాంట్‌ను ఈ దిశలో పెంచుకుంటే.. దంపతుల మధ్య గొడవలే...?

గృహంలో మనీప్లాంట్‌ను పెంచడం ద్వారా సిరిసంపదలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తుంటారు. మనీప్లాంటును ఇంట పెంచుకోవడం ద్వారా రుణబాధలుండవని అందరూ నమ్ముతున్నారు. అయితే మనీప్లాంట్‌ను ఇంట ఎలా పెంచుకో

Advertiesment
మనీప్లాంట్‌ను ఈ దిశలో పెంచుకుంటే.. దంపతుల మధ్య గొడవలే...?
, సోమవారం, 25 జూన్ 2018 (13:25 IST)
గృహంలో మనీప్లాంట్‌ను పెంచడం ద్వారా సిరిసంపదలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తుంటారు. మనీప్లాంటును ఇంట పెంచుకోవడం ద్వారా రుణబాధలుండవని అందరూ నమ్ముతున్నారు. అయితే మనీప్లాంట్‌ను ఇంట ఎలా పెంచుకోవాలనేది చాలామందికి తెలియదు. మనీప్లాంట్‌ను ఇంట పెంచాలనుకునేవారు.. సరైన దిశను ఎంచుకోవాలి. 
 
వాస్తు నిపుణులు ఏమంటున్నారంటే..? ఆగ్నేయ దిశ వైపున చూసే విధంగా ఈ చెట్టును పెంచాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. పాజిటివ్ ఎనర్జీ ఆగ్నేయ దిశలోనే అధికంగా వుంటుంది. అందుచేత ఈ దిశలో మనీ ప్లాంట్‌ను పెంచేటప్పుడు.. ధనానికి కొదవవుండదు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. 
 
వినాయకుడు ఆగ్నేయ దిశ అనుకూలమైనది కావడంతో ఆ దిశలో మనీప్లాంట్‌ను పెంచితే ఆర్థిక బాధలుండవు. ఇంకా ఈ దిశకు శుక్రుడు ఆధిపత్యం వహించడం ద్వారా శుక్రదశతో ప్రతికూల శక్తులు పారిపోతాయని.. అనుకూల ఫలితాలు చేకూరుతాయి. 
 
అలాగే వాస్తు దోషాలు తొలగిపోతాయి. కానీ తూర్పు, పడమర దిశలో మనీప్లాంట్‌ను పెంచుకుంటే దంపతుల మధ్య వాదోపవాదాలు పెరుగుతాయి. ఎప్పుడూ భాగస్వాములు వాదోపవాదాలకు దిగుతారు. ఈ దిశలో మనీప్లాంట్ పెంచుకోకూడదని, తద్వారా దంపతుల మధ్య గొడవలు ఎక్కువవుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మనీప్లాంట్‌లోని ఆకులు నేలను తాకేలా వుండకుండా ఈ ప్లాంట్‌ను పెంచాలి. 
 
ఎప్పుడూ ప్లాంట్‌లో నీళ్లుండేలా చూసుకోవాలి. ఇంకా మనీప్లాంట్ ఆకులు బాగా పెరిగినట్లైతే ఆ ఇంట ఎలాంటి దోషాలు లేవని గ్రహించాలి. ఈ చెట్టును అధిక వేడి, చలి, వర్షం తగిలే ప్రాంతాల్లో వుంచకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈశాన్య దిశలో మనీప్లాంట్‌ను పెంచుకోకూడదు. ఇలా పెంచుకున్నట్లైతే ధననష్టం, కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విబూదిని ధరిస్తే ప్రయోజనం మేంటి?