Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భావోద్వేగంతో ముప్పే.. సమస్యలొస్తే ఎవరితో మాట్లాడాలి?

విజయం వరించాలంటే.. భావోద్వేగాలను అధిగమించాలి. ఒత్తిడిని నియంత్రించుకోవడం తెలియాలి. అప్పుడే మానసికాందోళనలను దూరం చేసుకోగలుగుతారని సైకలాజిస్టులు సూచిస్తున్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా నెగ్గాలంటే కేవలం ప్రత

భావోద్వేగంతో ముప్పే.. సమస్యలొస్తే ఎవరితో మాట్లాడాలి?
, శనివారం, 28 ఏప్రియల్ 2018 (13:19 IST)
విజయం వరించాలంటే.. భావోద్వేగాలను అధిగమించాలి. ఒత్తిడిని నియంత్రించుకోవడం తెలియాలి. అప్పుడే మానసికాందోళనలను దూరం చేసుకోగలుగుతారని సైకలాజిస్టులు సూచిస్తున్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా నెగ్గాలంటే కేవలం ప్రతిభ మాత్రం ఉంటే సరిపోదు. భావోద్వేగాలను అధికమించడం పట్ల కూడా అవగాహన ఉండాలి. 
 
భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలంటే.. ఏదైనా ఓ సంఘటన లేదా సమస్య ఎదురైనప్పుడు పదే పదే దాన్ని తలచుకుని బాధపడటం మానేయాలి. సమస్యను అంగీకరించి.. పరిష్కారానికి మార్గం ఆలోచించాలి.

కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిన బాధల్ని ఎదుర్కొని తీరాల్సిందేనని మనసుకి చెప్పాలి. దీన్నే రియలైజేషన్ అంటారు. ఇది మీకు నిబ్బరాన్ని ఇవ్వడమే కాకుండా ఏం చేయాలో చెబుతుంది. విజేతల ఆత్మకథలు చదవడానికి ప్రాధాన్యం ఇవ్వండి. వారి జీవితాల్లోని ఎదుర్కొన్నఎగుడు దిగుళ్లను అవి మీకు తెలియజేస్తాయి. 
 
కష్టాలొచ్చినప్పుడు వాటిని గుర్తుచేసుకొని మెుండిగా ముందుకెళ్లే స్ఫూర్తినీ, పరిణతినీ అందిస్తాయి. సమస్యలు, ఇబ్బందులు వున్నప్పుడు.. ఒంటరిగా గాకుండా అందరితో కలిసిపోవాలి.

ఇతరులతో అంటే సానుకూల ఆలోచన కలిగి వారితో ఎక్కువగా మాట్లాడాలి. మనసుకు దగ్గరైన వారితో ఆలోచనల్ని పంచుకోవడం, సలహాలు తీసుకోవడం చేయాలి. అప్పుడే స్పష్టత వస్తుంది. దీనితో  పాటూ యోగా, ధ్యానం వంటివీ భావోద్వేగాలను అదుపులో ఉంచడానికి తోడ్పడతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యూటీ టిప్స్... పర్‌ఫ్యూమ్ వాసన చాలాసేపు వుండాలంటే వాజిలిన్‌‌‌ను?