Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ... ఏం చేయాలి?

ఇంట్లో ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అయితే వాస్తు దోషాలు వున్నాయని గుర్తించాలి. ఇంట్లో వున్న నెగటివ్ ఎనర్జీ కూడా ఇందుకు కారణమై వుండవచ్చునని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంట్లో మీరే ఉన్నా.. మీ ఇంటికి వచ్చే అతిథుల ద్వారా నె

Advertiesment
ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ... ఏం చేయాలి?
, గురువారం, 29 మార్చి 2018 (17:30 IST)
ఇంట్లో ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అయితే వాస్తు దోషాలు వున్నాయని గుర్తించాలి. ఇంట్లో వున్న నెగటివ్ ఎనర్జీ కూడా ఇందుకు కారణమై వుండవచ్చునని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంట్లో మీరే ఉన్నా.. మీ ఇంటికి వచ్చే అతిథుల ద్వారా నెగటివ్ ఎనర్జీ ఇంటికి వస్తుందని వాస్తు శాస్త్రం చెప్తోంది. నెగటివ్ ఎనర్జీని, వాస్తు దోషాలను నివారించుకుని.. సుఖమయ జీవితాన్ని గడపాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది.
 
వేపాకులు- యాంటీ వైరల్, యాంటీ బయోటిక్‌ కలిగిన ఈ  వేపాకులను కాల్చి పొగవేస్తే ఇంట్లోని  బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులు నాశనమౌతాయి. అంతేకాదు.. ఇంట్లో మండిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి. 
 
అగరవత్తులు- దేవతా పూజ సమయంలోనే కాకుండా అగరవత్తులను ఎప్పుడైనా వెలిగించవచ్చు. కానీ అగరవత్తులను బేసి సంఖ్యల్లోనే వెలిగించాలట. 2, 4, 6 ఆ కౌంట్‌తో అగరవత్తులను వెలిగించకూడదట. 3, 5, 7 సంఖ్యలోనే అగరవత్తులను వెలిగించాలట. 
 
ఫర్నిచర్: మంచాలు, కుర్చీలు, మంచాలు ఒకే దిశగా కాకుండా అప్పుడప్పుడు మార్పులు చేసి తిరిగి యధాస్థానంలో ఉంచితే వాస్తు దోషాలు తొలగిపోతాయి. 
 
ఉప్పు : రెండు చిన్నపాటి గిన్నెలను తీసుకుని అందులో ఉప్పును నింపి.. ఈశాన్య దిశలో ఉంచాలి. ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ మాయమవుతాయి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. 
 
కిటికీలు : విండోస్‌ను తెరిచే వుంచాలి.. అలా తెరిచి వుంచిన కిటికీల వద్ద మొక్కలను ఉంచితే నెగటివ్ ఎనర్జీ బయటికి పోవడం పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రావడం జరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పసుపు, కుంకుమ చేతి నుండి కింద జారిపడితే.. అశుభమా?