Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టుకున్న లక్ష్ చదలవాడ కొత్త చిత్రం

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (14:01 IST)
Laksh Chadalwada and his team
వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న హీరో లక్ష్ చదలవాడ. వలయం సినిమా తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ హీరో త్వరలోనే గ్యాంగ్ స్టర్ గంగ రాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కి సంబంధించిన పాటలు ఇటీవలే విడుదల కాగా వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. 
 
త్వరలోనే ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. అయితే మంచి కథలను ఎంచుకుంటూ విభిన్నమైన సినిమాలను చేస్తూ హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న ఈ హీరో తాజాగా మరో సినిమా కు శ్రీకారం చుట్టారు.  
 
విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సరికొత్త కథ తో తెరకెక్కుతున్న ఈ వినూత్నమైన సినిమా తొందరలోనే షూటింగ్ కు వెళ్లనుంది. ప్రొడక్షన్ నంబర్ 12 గా చదలవాడ బ్రదర్స్ సమర్పణ లో  శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా ని పద్మావతి చదలవాడ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ లోని ఆఫీస్ కార్యాలయం లో జరిగాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments