Webdunia - Bharat's app for daily news and videos

Install App

లగడపాటి శ్రీధర్ "స్టైల్" విడుదలై నేటికి 15 ఏళ్ళు

Webdunia
మంగళవారం, 12 జనవరి 2021 (19:45 IST)
టాలీవుడ్ ప్రొడ్యూసర్స్‌లో తనకంటూ ప్రత్యేకమైన "స్టైల్" కలిగిన నిర్మాతల్లో లగడపాటి శ్రీధర్ ఒకరు. కేవలం లాభాపేక్షతో కాకుండా... తను నిర్మించే ప్రతి సినిమా సమాజానికి ఎంతోకొంత ఉపయోగపడాలని తపించే లగడపాటి శ్రీధర్ నిర్మించిన 'స్టైల్' చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 15 ఏళ్ళు.
 
ప్రభుదేవా, రాఘవ లారెన్స్, జయసుధ, రాజా, ఛార్మి, కమలిని ముఖర్జీ ముఖ్య తారాగణంగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 12-1-2006లో విడుదలై ఘన విజయం సాధించింది.
 మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున పోషించిన ప్రత్యేక అతిధి పాత్రలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
 
కబీర్ లాల్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. మదర్ సెంటిమెంట్‌కు పాజిటివ్ ఆటిట్యూడ్ జోడించి.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే డాన్సులతో.. ప్రతికూల పరిస్థితుల్లో సానుకూల దృక్పధం ఆవశ్యకతను వివరిస్తూ.. తెరకెక్కిన ఈ చిత్రం క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా నేటికీ ఉర్రూతలూగిస్తూనే ఉంది. ఈ చిత్రం తమిళంలో  'లక్ష్యం' పేరుతో అనువాదమై అక్కడ కూడా మంచి విజయం నమోదు చేసింది!!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

ఆ కేసులో రాహుల్ గాంధీ అరెస్టు తప్పదా?

సెట్‌లో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా : మాళవికా మోహనన్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments