Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో 'ఎల్ ‌7' టీమ్‌ హల్‌చల్‌ .. సేవా కార్యక్రమాల్లో నిమగ్నం

రాహుల్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఆదిత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఎల్‌ 7'. పూజా జావేరి కథానాయిక. ముకుంద్‌ పాండే దర్శకుడు. బి.ఓబుల్‌ సుబ్బారెడ్డి నిర్మాత. శుక్ర, శని, ఆదివారాల్లో ఈ చిత్రం టీమ్‌ సభ్యులు

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2016 (16:21 IST)
రాహుల్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఆదిత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఎల్‌ 7'. పూజా జావేరి కథానాయిక. ముకుంద్‌ పాండే దర్శకుడు. బి.ఓబుల్‌ సుబ్బారెడ్డి నిర్మాత. శుక్ర, శని, ఆదివారాల్లో ఈ చిత్రం టీమ్‌ సభ్యులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో పలు కాలేజ్‌లను సందర్శించి బ్లడ్‌ క్యాంపులను నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం విజయవాడలో హల్‌ చేశారు. 
 
దీని గురించి నిర్మాత మాట్లాడుతూ... ''శనివారం విజయవాడలోని పలు ప్రాంతాల్లో హెల్త్‌ క్యాంపులను నిర్వహించాం. అక్కడి ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వచ్చింది. ఇక సినిమా విషయానికొస్తే... లవ్‌, కామెడీ, హారర్‌ అంశాలతో ఏడు భిన్న కథలతో రూపొందుతున్న చిత్రమిది. ప్రేమలో ఏడు కోణాల్ని చూపించే ప్రయత్నం చేశాం. ఆదిత్‌కు కరెక్ట్‌గా యాప్ట్‌ అయ్యే కథ ఇది. అతని క్యారెక్టర్‌ సినిమాకు హైలైట్‌ అవుతుంది. పూజా నటనకు ప్రాధాన్యమున్న పాత్ర చేస్తుందన్నారు.
 
ఇటీవల విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌లకు చక్కని స్పందన వచ్చింది. పాటలు కూడా అదే రీతిలో ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నాం. త్వరలో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి నెలాఖరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దుర్గాప్రసాద్‌, సంగీతం: అరవింద్‌ శంకర్‌, ఆర్ట్‌: నాగసాయి, సమర్పణ: మాస్టర్‌ ప్రీతమ్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌, కో.ప్రొడ్యూసర్‌: బి.మోహనరావు, సతీష్‌ కొట్టె. 

వెలుగు చూడాల్సిన జగన్ జల్సా ప్యాలెస్ రహస్యాలు చాలా ఉన్నాయ్... : మంత్రి నారా లోకేశ్

సిగ్నల్ జంప్ చేసి ఎక్స్‌ప్రెస్ రైలను ఢీకొన్న గూడ్సు రైలు.. 15కి పెరిగిన మృతులు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన... త్వరలో ప్రారంభం

19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్

లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన అన్నాడీఎంకే... రీఎంట్రీకి ఆసన్నమైందంటున్న శశికళ!

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments