Webdunia - Bharat's app for daily news and videos

Install App

విక్టరీ వెంకటేష్‌ కొత్త చిత్రం టైటిల్ 'ఆడవాళ్ళూ.. మీకు జోహార్లు'

విక్టరీ వెంకటేష్‌ కొత్త చిత్రం టైటిల్ 'ఆడవాళ్ళూ.. మీకు జోహార్లు' వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ.. హీరోగా తనకంటూ ఒక మార్క్‌ క్రియేట్‌ చేసుకున్న కథానాయకుడు విక్టరీ వెంకటేష్‌. ఈ అగ్ర కథానాయకుడు నటించనున్

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2016 (16:14 IST)
విక్టరీ వెంకటేష్‌ కొత్త చిత్రం టైటిల్ 'ఆడవాళ్ళూ.. మీకు జోహార్లు' వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ.. హీరోగా తనకంటూ ఒక మార్క్‌ క్రియేట్‌ చేసుకున్న కథానాయకుడు విక్టరీ వెంకటేష్‌. ఈ అగ్ర కథానాయకుడు నటించనున్న నూతన చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. 'నేను శైలజ' చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న యువ దర్శకుడు కిషోర్‌ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. మల్టీ డైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై లిమిటెడ్‌ సమర్పణలో పి.ఆర్‌.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పూస్కూర్‌ రామ్‌మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఆడవాళ్ళూ.. మీకు జోహార్లు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
 
అక్టోబర్‌లో ప్రారంభంకానున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత పూస్కూర్‌ రామ్‌మోహన్‌ రావు, దర్శకుడు కిషోర్‌ తిరుమల తెలియజూస్తూ... అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇంతకుముందు వెంకటేష్‌ నటించిన 'ఆడవారిమాటలకు అర్థాలే వేరులే', 'మల్లీశ్వరి', 'నువ్వు నాకు నచ్చావ్‌' తరహాలో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం సాగుతుంది. ఈ చిత్రానికి టైటిల్ 'ఆడవాళ్ళూ.. మీకు జోహార్లు'గా ఖరారు చేశాం. వెంకటేష్‌ నుంచి కుటుంబ ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ చిత్రంలో వెంకటేష్‌ పాత్ర చాలా సహజంగా ఉంటుంది... అక్టోబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ని ప్రారంభిస్తాం. త్వరలోనే వెంకటేష్ సరసన నటించే కథానాయిక‌తో పాటు.. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తాం. ప్రస్తుతం వెంకటేష్ బాబు నటించిన 'బాబు బంగారం' చిత్రం మంచి విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తకు దూరంగా వుంటున్నావుగా, చేపల కూర చేసుకుని రా: ఎస్సై లైంగిక వేధింపులు

వైసీపీ పిల్ల కాకి.. ఎప్పటికైనా కాంగ్రెస్‍లో విలీనం కావాల్సిందే : వైఎస్ షర్మిల (Video)

పెంపుడు కుక్క కాటుకు బలైన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే?

ప్రేమ వ్యవహారం.. యువకుడిని కత్తులతో పొడిచి హత్య

తెలంగాణ సీనియర్ నేత జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments