Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖుషీ కపూర్ హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి 'ఉప్పెన' మూవీ రీమేక్

ఠాగూర్
శుక్రవారం, 22 మార్చి 2024 (15:11 IST)
వైష్ణవ్ తేజ్ - కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ఉప్పెన, బుచ్చిబాబు సాన దర్శకుడు. విజయ్ సేతుపతి ప్రతినాయకుడు. మంచి యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. అటు కలెక్షన్ల వర్షం కురిపించింది. అలాగే, ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఇపుడు బాలీవుడ‌లోకి రీమేక్ చేయనున్నారు. ఇందులో కృతిశెట్టి పాత్రను ఖుషీ కపూర్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు బోనీ కపూర్ నిర్మించనున్నట్టు ఆయన వెల్లడించారు. 
 
హైదరాబాద్ నగరంలో రామ్ చరణ్ నటించే 16వ చిత్రం పూజా కార్యక్రమం తాజాగా జరిగింది. ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమానికి నిర్మాత బోనీ కపూర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'బుచ్చిబాబు దర్శకత్వం వహించిన 'ఉప్పెన' చిత్రం చూశాను. చాలా నచ్చింది. దీన్ని హిందీలో రీమేక్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నా చిన్న కూతురు ఖుషీ కపూర్‌ను కూడా 'ఉప్పెన' చూడమని చెప్పాను' అన్నారు. దీంతో త్వరలోనే ఈ చిత్రం రీమేక్‌ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇందులో హీరోగా ఎవరిని తీసుకుంటారన్నది మాత్రం సస్పెన్స్‌గా ఉంది. 
 
కాగా, ఖుషీ కపూర్‌‌కు రెండు క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఆమీర్‌ఖాన్‌, సైఫ్‌ అలీఖాన్‌ కుమారుల సినిమాల్లో ఆమె నటించనున్నారట. కరణ్‌ జోహార్‌ నిర్మిస్తోన్న 'నాదనియాన్‌' చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ కుమారుడు ఇబ్రహీం ఖాన్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఖుషీని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, ఆమీర్‌ఖాన్‌ కుమారుడు జువైద్‌ ఖాన్‌తోనూ ఆమె జోడీ కట్టనున్నట్లు తెలుస్తోంది. తమిళంలో విజయం సాధించిన 'లవ్‌టుడే'ను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయనున్నారని.. ఇందులో జువైద్‌ సరసన ఆమె నటించనున్నట్లు సమాచారం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments