ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్‌పై వీలు చిక్కినప్పుడల్లా విమర్శలు చేసేందుకు వెనుకాడట్లేదు. తాజాగా పవన్ కళ్యాణ్‌ను మ్యారేజ్ స్టార్, 'వంచకుడు' అని జగన్ సంబోధించారు.
"పవన్ కళ్యాణ్‌కు వివాహ రాజ్యాంగంపై గౌరవం లేదు. ఐదేళ్లకు ఒకసారి భార్యలను మార్చే అలవాటు ఉన్న కళ్యాణ నక్షత్రం. ఇతర వ్యక్తులు కార్లను ఎలా మారుస్తారో అలాగే అతను భార్యలను మారుస్తాడు." అంటూ తీవ్రస్థాయిలో పవన్‌పై జగన్ విరుచుకుపడ్డారు. పవన్ పెళ్లిళ్లపై జగన్ విమర్శలు చేయడం కొత్తేమీ కాదు.
వారం రోజుల క్రితమే జగన్ పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ పెళ్లిళ్ల విషయంపై విమర్శలు గుప్పించారు. మళ్లీ జగన్ తన ప్రసంగాన్ని పవన్ పెళ్లిళ్లపై ఫోకస్ చేసి, ఆయనను కళ్యాణ నక్షత్రం అని పిలిచారు. పవన్ కల్యాణ్ వివాహాలపై రాజకీయంగా సంబంధం లేని అంశాన్ని సీఎం టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారుతోంది.