Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే...

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (19:27 IST)
టాలీవుడ్ హీరోయిన్ సమంత కేసులో కూకట్‌పల్లి కోర్టు కీలక తీర్పును వెలువరించింది. హీరో నాగచైతన్యతో తన వైవాహిక బంధాన్ని తెంచుకుంటున్నట్టు సమంత ప్రకటించింది. దీన్ని పలు యూట్యూబ్ చానెళ్లు వక్రీకరిస్తూ పలు కథనాలను ప్రచురించాయి. 
 
అయితే సీఎల్ వెంకట్రావు అనే వ్యక్తితో పాటు పలు యూట్యూబ్ చానళ్లు తన వ్యక్తిగత జీవితంపై ఇష్టంవచ్చినట్టు ప్రచారం చేస్తున్నాయంటూ సమంత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో ఆమె కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించారు. సమంతపై కోర్టులో మంగళ విచారణ కొనసాగించింది. 
 
సమంతపై కంటెంట్‌ను యూట్యూబ్ చానళ్లు వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసింది. సీఎల్ వెంకట్రావు సైతం తన కంటెంట్‌ను తొలగించాలని కూకట్‌పల్లి కోర్టు స్పష్టంచేసింది. 
 
యూట్యూబ్ చానళ్లు ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడరాదని, అదేసమయంలో సమంత కూడా తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదని న్యాయస్థానం పేర్కొంది. అందువల్ల సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోలు తక్షణం తొలగించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

monkey: రూ.2లక్షల ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి.. (video)

Chittoor man snake bite పాములకు అతనంటే చాలా ఇష్టం.. 30ఏళ్లుగా కాటేస్తూనే వున్నాయి..

సీఐడీ కస్టడీకి పోసాని కృష్ణమురళి.. ఒక రోజు విచారణకు అనుమతి!

ప్రభుత్వ కొలువున్న వరుడు కావలెను .. నల్లగా ఉన్నా ఫర్వాలేదంటున్న యువతి (Video)

ఇన్‌స్టాఖాతాలో మైనర్ బాలికలకు గాలం ... ఆపై వ్యభిచారం.. ఎక్కడ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments