Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ స్కూలులో బాత్రూమ్ కూడా లేదు.. ప్రదీప్ ట్వీట్.. కేటీఆర్ స్పందన

డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడి వార్తల్లోకెక్కిన యాంకర్ ప్రదీప్.. ఓ పాఠశాల బాలికలకు మంచి జరిగేలా చూశాడు. తద్వారా తన మంచి మనసును చాటుకున్నాడు. బాలికలు పాఠశాలలో ఎదుర్కొనే ప్రధాన సమస్యను పరిష్కరించాలని మం

Webdunia
శనివారం, 10 ఫిబ్రవరి 2018 (10:45 IST)
డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడి వార్తల్లోకెక్కిన యాంకర్ ప్రదీప్.. ఓ పాఠశాల బాలికలకు మంచి జరిగేలా చూశాడు. తద్వారా తన మంచి మనసును చాటుకున్నాడు. బాలికలు పాఠశాలలో ఎదుర్కొనే ప్రధాన సమస్యను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్‌ను విజ్ఞప్తి చేశాడు. 
 
ఇంతకీ ప్రదీప్ కేటీఆర్‌కు ఏం వినతి చేశారంటే.. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం చర్లపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దుస్థితిని వివరించారు. ఆ పాఠశాలలో బాలికలకు బాత్రూమ్ కూడా లేదని.. మంచి నీటి సదుపాయం లేదని ప్రదీప్ సమస్యలను ఎత్తి చూపారు. 
 
ఇందుకు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ పాఠశాల విద్యార్థుల సమస్యలను తప్పకుండా తీర్చుతామని ట్వీట్ చేసి హామీ ఇచ్చారు. మేడ్చల్ కలెక్టర్‌ ఈ విషయంలో వెంటనే స్పందించాలని.. సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఇక మంత్రి కేటీఆర్ ఇచ్చిన సమాధానం పట్ల ప్రదీప్ హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

భార్య వేధిస్తోంది.. పోలీసులు పట్టించుకోవడం లేదు : టెక్కీ ఆత్మహత్య

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments