Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కనకమామిడి ఫామ్‌హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (09:32 IST)
అనారోగ్యం కారణంగా మృతి చెందిన తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. మొయినాబాద్‌, కనకమామిడి ఫాంహౌస్‌లో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. వీటిని తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. 
 
కాగా, అనారోగ్య సమస్యలతో పాటు పోస్ట్ కోవిడ్, కార్డియాక్ అరెస్ట్ కారణంగా కృష్ణంరాజు ఆదివారం వేకువజామున 3.25 గంటలకు హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. 
 
సోమవారం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచుతారు. ఆ తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తారు. వీటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్వయంగా పర్యవేహిస్తున్నారు. 
 
మరోవైపు, కృష్ణంరాజు పార్థివదేహాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు నటులు చిరంజీవి, పవన్, వెంకటేష్, మహేష్, సుమన్, మోహన్ బాబుతో పాటు అనేక మంది సినీ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం - రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదు

ఏబీసీడీలు నేర్పించేందుకు నెలకు రూ.21 వేలా?

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్ రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments