మెగాస్టార్‌కు పునాదిరాళ్లు.. వైష్ణవ్‌కు క్రిష్ సినిమా.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (17:37 IST)
వైష్ణవ్ తేజ్ దశ తిరిగింది. ఉప్పెనకు మంచి హిట్ టాక్ రావడంతో దర్శకులు అతని డేట్స్ కోసం ఎగబడుతున్నారు. అలాగ సాధారణంగా క్రిష్ సినిమా అంటే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. అయితే ఈ డైరెక్టర్ ఇపుడు వైష్ణవ్‌తేజ్ తో సినిమా చేస్తుండగా..ఈ ప్రాజెక్టుకు బిజినెస్ క్రేజ్ పెరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు.
 
కానీ ఉప్పెన విడుదల తర్వాత సినిమాపై అంచనాలు పెరిగి.. బిజినెస్ కూడా బాగానే జరిగే అవకాశాలున్నాయని టాలీవుడ్ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొండపొలం నవల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని క్రిష్‌-రాజీవ్ రెడ్డి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.
 
ఉప్పెన చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో క్రిష్-వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు కూడా మంచి బిజినెస్ జరుగుతుందని అనుకుంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. క్రిష్ ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తాడని గతంలో వార్తలు రాగా..మరి థియేటర్లలో రిలీజ్ అవుతుందా..? ఓటీటీలోనా అనేది తెలియాల్సి ఉంది.

ఇక కొసమెరుపు ఏంటంటే? వైష్ణవ్ తేజ్ టాలీవుడ్‌లో మెగాస్టార్ స్థాయికి ఎదిగే అవకాశం వుందని సినీ పండితులు అంటున్నారు. ఇందుకు కారణం ఏంటంటే? వైష్ణవ్ తేజ్ ఉప్పెనకు ముందు క్రిష్ సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. ఇంకా ఉప్పెనకు ముందే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. అయితే టెక్నికల్ కారణాలతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. దీంతో ఉప్పెన సినిమా తెరపైకి వచ్చి బంపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

అలాగే వైష్ణవ్ తేజ్ నటన, బాడీ లాంగ్వేజ్, కంటి చూపు వంటివి అతని బాగా ప్లస్ అయ్యాయని టాక్ కూడా వచ్చింది. ఇంకా మరో సెంటిమెంట్ కూడా ఉప్పెన హీరోకు కలిసొస్తుందని వినికిడి. ఎలాగంటే మెగాస్టార్ చిరంజీవి తొలి సినిమా పునాదిరాళ్లు కూడా విడుదల కాలేదు. 

ఇలాగే వైష్ణవ్ క్రిష్‌‌తో చేసిన సినిమా కూడా విడుదల కాలేదు. ఇద్దరికీ రెండో సినిమానే రిలీజ్ అయ్యింది. ఈ సెంటిమెంట్ కూడా వైష్ణవ్‌కు టాలీవుడ్‌లో అగ్ర హీరోగా ఎదిగేందుకు సాయపడుతుందని చర్చ సాగుతోంది. మరి ఉప్పెన హీరో మెగాస్టార్‌లా టాలీవుడ్‌లో అదరగొడతాడా అనేది తెలియాలంటే.. కాస్త వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments