Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమమ్ హీరోయిన్ సాయి పల్లవితో జతకడుతున్న నాగ చైతన్య

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒక్క సినిమాతో ఒక భాషా ప్రాంత ప్రజలపై చిరస్మరణీయ ప్రభావం వేసిన అద్భుత నటి సాయిపల్లవి. మలయాళ మాతృక ప్రేమమ్ సినిమాలో కాలేజీ లెక్చరర్‌గా నటించిన సాయి పల్లవి కేరళ యువతీయువకుల్లో ప్రేమ పట్ల ఉన్న అభిప్రాయాన్నే మార్చివేసింది. మాలివుడ

Webdunia
బుధవారం, 24 మే 2017 (04:32 IST)
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒక్క సినిమాతో ఒక భాషా ప్రాంత ప్రజలపై చిరస్మరణీయ ప్రభావం వేసిన అద్భుత నటి సాయిపల్లవి. మలయాళ మాతృక ప్రేమమ్ సినిమాలో కాలేజీ లెక్చరర్‌గా నటించిన సాయి పల్లవి కేరళ యువతీయువకుల్లో ప్రేమ పట్ల ఉన్న అభిప్రాయాన్నే మార్చివేసింది. మాలివుడ్ చరిత్రలోనే ఒక పాత్ర ద్వారా సమాజంపై అంత ప్రభావం వేసిన చిత్రం మరొకటి లేదని పేరుపడింది.


తెలుగులో నాగచైతన్య తీసిన అదే సినిమాలో సాయి పల్లవి పాత్రను పోషించిన శ్రుతిహసన్ ఎంతగా తేలిపోయిందంటే ఈనాటికీ నెటిజన్లు ఆ ఇద్దరనీ పక్కపక్కనే పోల్చి చూస్తూ గేలి చేస్తున్నారు. నటనలో మార్దవత్వానికి, సున్నిత ప్రదర్శనకు ప్రతీకగా నిలిచిన పల్లవి ఇప్పుడు నాగచైతన్యతో తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకుంది.
 
మలయాళ చిత్రం ప్రేమమ్‌ కోలీవుడ్‌లోనూ సంచలన విజయం సాధించింది. చెన్నైలో 200 రోజులు ప్రదర్శింపబడిన మలయాళ చిత్రం ఇదే అవుతుంది. అలాంటి చిత్రంలో మలర్‌గా ప్రధాన కథానాయకి పాత్ర పోషించిన నటి సాయిపల్లవి. ఇదే ప్రేమమ్‌ తెలుగులోనూ రీమేక్‌ అయ్యి విజయం సాధించింది. దీంతో సాయిపల్లవిని కోలీవుడ్‌కు తీసుకురావాలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. స్వయాన ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం కూడా సాయిపల్లవిని తన చిత్రంలో నటింపజేసే ప్రయత్నం చేసినా, అది కుదరలేదు.
 
కాట్రువెలియిడై చిత్రంలో కార్తీకి జంటగా ఎంపికై,  విక్రమ్‌కు జంటగా స్కెచ్‌ చిత్రంలో నాయకిగా ఎంపికై, విజయ్‌ దర్శకత్వంలో మాధవన్‌కు జంటగా మలయాళ చిత్రం చార్లీ హీరోయిన్‌గా ఎంపికై కూడా కొన్ని కారణాల వల్ల ఆ చిత్రాల నిర్మాణం వాయిదా పడింది. ఇలా మూడు అవకాశాలు వచ్చినా సాయిపల్లవి కోలీవుడ్‌కు రంగప్రవేశం చేయలేకపోయింది. 
 
ఇలాంటి పరిస్థితిలో దర్శకుడు విజయ్‌నే మరోసారి సాయిపల్లవికి అవకాశం కల్పించారు. ఆయన తెరకెక్కించనున్న ద్విభాషా చిత్రం కరులో నాయికిగా సాయిపల్లవి నటించనుంది. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌ యువ కథానాయకుడు నాగచైతన్య కోలీవుడ్‌కు పరిచయం కానున్నారన్నది గమనార్హం. మొత్తం మీద సాయిపల్లవి టాలీవుడ్‌ నటుడు నాగచైతన్యతో కలిసి కోలీవుడ్‌కు పరిచయం కానున్నదన్న మాట. ఈ చి త్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Polavaram: జనవరి 2, 2025న పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభం

వృద్ధ మహిళపై వీధికుక్కల గుంపు దాడి.. చివరికి ఏమైందంటే? (video)

ఉత్తరాఖండ్‌- 1,500 అడుగుల లోయలో పడిన బస్సు.. ముగ్గురు మృతి (video)

Venu Swamy: అల్లు అర్జున్‌కు మార్చి 29 వరకు టైమ్ బాగోలేదు (video)

Jani Master: శ్రీతేజను పరామర్శించిన జానీ మాస్టర్.. ఇంత వరకే మాట్లాడగలను (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments