Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి చిత్రం ప్రపంచంలో టాలీవుడ్ గుర్తింపునే మార్చేసింది: అనిల్ కపూర్

ఇన్నాళ్లకు బాలీవుడ్ ‌నుంచి ఒక సీనియర్ నటుడు బాహుబలి పట్ల నిజాయితీతో కూడిన ప్రశంస చేసారు. ఆయనెవరో కాదు. తెలుగు చిత్రపరిశ్రమతో చాలా కాలం నుంచి మంచి సంబంధాలు కలిగిన బాలీవుడ్ ప్రముఖ హీరో అనిల్ కపూర్. సుప్రసిద్ధ దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన వంశవృక్షం

Webdunia
బుధవారం, 24 మే 2017 (02:06 IST)
ఇన్నాళ్లకు బాలీవుడ్ ‌నుంచి ఒక సీనియర్ నటుడు బాహుబలి పట్ల నిజాయితీతో కూడిన ప్రశంస చేసారు. ఆయనెవరో కాదు. తెలుగు చిత్రపరిశ్రమతో చాలా కాలం నుంచి మంచి సంబంధాలు కలిగిన బాలీవుడ్ ప్రముఖ హీరో అనిల్ కపూర్. సుప్రసిద్ధ దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన వంశవృక్షం సినిమానే అనిల్ కపూర్ మొదటి సినిమా కావడం విశేషం. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచమంతా తెలుగు చిత్రపరిశ్రమ (టాలీవుడ్) వైపు చూస్తోందని అనిల్ ప్రశంసించారు. 
 
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత ప్రపంచమంతా తెలుగు చిత్రపరిశ్రమ (టాలీవుడ్) వైపు చూస్తోందని బాలీవుడ్‌ ప్రముఖ హీరో అనిల్‌ కపూర్‌ అభిప్రాయపడ్డారు. నగరానికి చెందిన  డ్రీమ్‌ ఇండియా గ్రూపు ప్రారంభించనున్న సరికొత్త రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ను ఆయన బంజారాహిల్స్‌ తాజ్‌కృష్ణ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినీపరిశ్రమకు మంచి సామర్థ్యం ఉందని, తనకు ఈ పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. 
 
తన మొదటి సినిమా కూడా బాపు దర్శకత్వంలో వంశవృక్షం తెలుగులో వచ్చిందని గుర్తుచేశారు. హైదరాబాద్‌ నగర ప్రజలతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయని తెలిపారు. డ్రీమ్‌ ఇండియా గ్రూప్‌నకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్ట్‌ బహదుర్‌పురా సమీపంలో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో 300 ఎకరాల్లో రానుందని సంస్థ సీఎండీ సయ్యద్‌ రఫీ ఇషాక్‌ తెలిపారు.
 
బాహుబలి టాలీవుడ్‌కి తెచ్చిన గుర్తింపు ఔన్నత్యాన్ని బాలీవుడ్ నటుడు స్వచ్ఛంగా ప్రశంసించడం చాలా బాగుంది. 

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments