Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 రోజుల క్రితం గుండెపోటు, డబ్బుల్లేక చిన్న ఆస్పత్రిలో తమిళ కమెడియన్, కన్నుమూత

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (20:40 IST)
తమిళ సినిమాల్లో ప్రముఖ కమెడియన్ వడివేలుని అలవోకగా అనుసరించి కడుపుబ్బ నవ్వించే కోలీవుడ్ యువ నటుడు వడివేల్ బాలాజీ కన్నుమూశారు. గత పదిహేను రోజులుగా గుండె సంబంధ సమస్యతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో చనిపోయాడు. ఆయన వయసు 42.
 
వడివేల్‌ బాలాజీని తొలుత పెద్ద ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ఆ తర్వాత హాస్పటల్ ఫీజు కట్టలేక చిన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. గత 15 రోజులుగా ఆయన చెన్నైలోని ఒమందురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఐతే గురువారం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. అతడిని కాపాడే ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యాయి.
 
ప్రఖ్యాత కోలీవుడ్ హాస్యనటుడు వడివేలును అనుకరించిన తరువాత వడివేల్ బాలాజీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. విజయ్ టీవీలో కలక్కపోవాదు యారు అనే టీవీ ప్రోగ్రామ్‌తో అడుగుపెట్టి ఆ తర్వాత విజయవంతంగా ముందుకు దూసుకుపోయాడు. వడివేల్ బాలాజీ తొలిసారిగా కోలమావు కోకిల చిత్రంలో నయనతారతో కలిసి నటించారు. టీవీ నుండి పెద్ద తెరపైకి విజయవంతంగా వచ్చిన కొద్దిమంది తమిళ నటులలో ఆయన ఒకరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments