కోలీవుడ్ నటి మీరా మిథున్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వచ్చింది. కోలీవుడ్ నటులు విజయ్, సూర్య, హీరోయిన్లు జ్యోతిక, త్రిష, ఐశ్వర్యారాయ్‌లను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసింది. తాజాగా రంజిత బాటలో బిగ్ బాస్ భామ అయిన మీరా మిథున్ రాసలీలల స్వామి నిత్యానందకు సపోర్ట్ చేసింది.
తాను కూడా నిత్యానంద సేవకు పోతానని షాకింగ్ పోస్టు చేసింది. బెయిల్‌పై విడుదలై పారిపోయిన నిత్యానందను కలుస్తానని.. తాను కూడా తాను కూడా త్వరలోనే కైలాస దేశానికి వెళతానని ప్రకటించింది. అనవసరంగా నిత్యానందన్‌ను ఆడిపోసుకున్నారంటూ ఆమె మండిపడింది.
అంతేగాకుండా నిత్యానందపై కోలీవుడ్ నటి మీరామిథున్ ప్రశంసలు కురిపించింది. ఆయన విషయంలో తప్పుగా ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేసింది. నిత్యానంద రోజురోజుకు మరింత శక్తివంతునిగా మారుతున్నారని పేర్కొంది. తాను త్వరలోనే 'నిత్యానంద కైలాస' దేశానికి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపిన మీరా... 'లాట్స్ ఆఫ్ లవ్' అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ కోలీవుడ్‌లో తారస్థాయిలో చర్చనీయాంశమైంది.
కాగా.. తమిళనాడులోని మధురైకు చెందిన నిత్యానంద స్వామి... తమిళ సినీ నటి రంజితతో రాసలీలలు జరుపుతున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేశారు. ఆ బెయిలుపై బయటకు వచ్చిన స్వామి... తొలుత నేపాల్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి నకిలీ పాస్‌పోర్టు ద్వారా కరేబియన్ దీవులకు చేరుకున్నాడని ఆరోపణలున్నాయి.
Nithyananda
కరేబియన్ దీవుల్లోని ఓ దీవిని సొంతంగా కొనుగోలు చేసి.. దానికి 'రిపబ్లిక్ ఆఫ్ కైలాస' అని పేరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ దేశంలోనే నిత్యానంద స్వామి తన శిష్యగణంతో సేదతీరుతున్నారు. ఈ క్రమంలో ఈ దేశానికి ప్రత్యేక కరెన్సీ కోసం ఓ రిజర్వు బ్యాంకును కూడా ఏర్పాటు చేశారు. దీనికి 'కైలాస రిజర్వు బ్యాంక్' అని పేరు పెట్టి, సదరు కరెన్సీ చెలామణి అయ్యేందుకు పలు దేశాలతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.