Webdunia - Bharat's app for daily news and videos

Install App

"దెయ్యమా.. మజాకా" ట్రైలర్‌ను ఆవిష్కరించిన కోడి రామకృష్ణ

తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హార్రర్ ఎంటర్‌టైనర్ "దెయ్యమా మజాకా". మానస్, అఖిల్, నీహారిక, మేఘన, నవీన్ ముఖ్య తారాగణంగా సంపత్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (16:59 IST)
తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హార్రర్ ఎంటర్‌టైనర్ "దెయ్యమా మజాకా". మానస్, అఖిల్, నీహారిక, మేఘన, నవీన్ ముఖ్య తారాగణంగా సంపత్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ ఆవిష్కరించారు. తనకు చిరకాల మిత్రుడైన రామ సత్యనారాయణ నిర్మిస్తున్న "దెయ్యమా మజాకా" మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
 
ఓ నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ వీకెండ్ పార్టీ నుంచి వస్తూ మద్యం మత్తులో నాలుగేళ్ల కుమార్తెతో సినిమా చూసి ఇంటికి వెళ్తున్న ఓ జంట ప్రయాణిస్తున్న కారును గుద్దేస్తారు. ప్రమాదంలో తల్లిదండ్రులిద్దరూ మరణిస్తారు. తనలాగే తన బిడ్డ అనాథ కాకూడదనే తపన కలిగిన ఆ బిడ్డ తల్లి ఆత్మగా మారుతుంది. ఈ క్రమంలో జరిగిన పరిణామాల సమాహారమే "దెయ్యమా మజాకా" అని, దర్శకుడు సంపత్ రాజ్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడని, కోడి రామకృష్ణ వంటి గ్రేట్ డైరెక్టర్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ జరుపుకున్న "దెయ్యమా మజాకా" ఘన విజయం సాధించడం తథ్యమని నిర్మాత రామ సత్యనారాయణ అన్నారు. 
 
ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రానికి కెమెరా: సంతోష్.ఎస్, ఎడిటింగ్: హరీష్ కుమార్, మ్యూజిక్: నవనీత్ చారి, సమర్పణ: ఫణిరాజ్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంపత్ రాజ్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాక్ యుద్ధాన్ని ఆపాను... నోబెల్ శాంతి బహుమతి రాదేమో? : డోనాల్డ్ ట్రంప్

స్త్రీ ఒక పువ్వు - ప్రశంస లేకుండా ఒక పువ్వుతో వ్యవహరిస్తే... : అలీ ఖమేనీ

'యోగా' అంటే ఏంటి? ఆర్కే బీచ్‌లో ప్రధాని మోడీ చెప్పిన అర్థమిదే.. (Video)

Yoga: సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. యోగా డేపై బాబు ప్రశంసలు

Yoga Day: జపాన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం.. బౌద్ధ ఆలయంలో యోగాసనాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments