Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానుల దీవెన‌లే దాస‌రి గారిని ర‌క్షించాయి: మ‌ంత్రి త‌ల‌సాని

ప్రముఖ ద‌ర్శక నిర్మాత దాస‌రి నారాయ‌ణ రావు ఇటీవ‌ల అనారోగ్యం కారణంగా కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్రముఖులు దాసరిని ప‌రామ‌ర్శించారు. ఈ నేప‌థ్

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (16:54 IST)
ప్రముఖ ద‌ర్శక నిర్మాత దాస‌రి నారాయ‌ణ రావు ఇటీవ‌ల అనారోగ్యం కారణంగా కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్రముఖులు దాసరిని ప‌రామ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఉద‌యం దాసరిని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాసయాద‌వ్ ప‌రామ‌ర్శించారు. 
 
అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... దాస‌రి తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్రమ‌కు తండ్రి లాంటి వారు. ప‌రిశ్రమ‌లో ఎవ‌రికి ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా ముందుండి ప‌రిష్కరిస్తారు. అంత గొప్ప వ్యక్తి అనారోగ్యానికి గురి కావ‌డం క‌లచి వేసింది. ప్రస్తుతం ఆయ‌న ఆరోగ్యం మొరుగు ప‌డుతోంది. 
 
త్వర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్థిస్తున్నారు. వారి దీవెన‌లే ఆయ‌న్ను ర‌క్షించాయి. రెండు, మూడు రోజుల్లో ఆయ‌న పూర్తిగా కోలుకుంటారు. ఆయ‌న ఆరోగ్యంపై ప్రతిరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ డాక్టర్ల‌ను సంప్రదించి వివ‌రాలు అడిగి తెలుసుకుంటున్నారు అని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments