Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.125 కోట్లతో సినిమా తీశారు.. రూ.6.20 కోట్లు అప్పు చెల్లించలేరా? రజినీ భార్యకు సుప్రీం చీవాట్లు

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్‌కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. "కొచ్చాడయాన్" సినిమా హక్కుల అమ్మకానికి సంబంధించి యాడ్ బ్యూరో అడ్వర్టైసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెల్లించాల్సిన బ

Webdunia
మంగళవారం, 3 జులై 2018 (16:10 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్‌కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. "కొచ్చాడయాన్" సినిమా హక్కుల అమ్మకానికి సంబంధించి యాడ్ బ్యూరో అడ్వర్టైసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెల్లించాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలని ఆదేశించింది. రూ.125 కోట్ల బడ్జెట్‌తో సినిమా నిర్మించగా, రూ.6.20 కోట్ల రుణం చెల్లించలేరా? అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు.
 
నిజానికి ఈ రుణాన్ని ఈ యేడాది ఫిబ్రవరిలోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటికీ రజినీ కుటుంబం ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి ఈ వ్యవహారంపై స్పందించింది. యాడ్ బ్యూరో బకాయిలు ఎందుకు చెల్లించలేదు... ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలంటూ ఆదేశించింది.
 
కాగా, రజినీ కుమార్తె సౌందర్యా రజినీకాంత్ దర్శకత్వంలో రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన యానిమేషన్ చిత్రం కొచ్చాడయాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments