రాకేశ్ శశి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు తొలి సినిమా విజేతగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మాళవిక నాయర్ నటించింది. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ కథ కొనసాగుత
రాకేశ్ శశి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు తొలి సినిమా విజేతగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మాళవిక నాయర్ నటించింది. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. మురళీశర్మ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలోని ఓ మాస్ మసాలా సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పాటలో చికెన్‌లోని రకాలు.. చికెన్ గురించి మొత్తం పాటగా పాడేశారు. చికెన్ లవర్స్ అందరి కోసం అంటూ ఈ పాట మొదలవుతుంది. కో.. కొక్కరోకో.. లిక్కరోకో.. ముక్కరోకో.. అంటూ ఈ పాట కొనసాగుతోంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం ఆకట్టుకునేలా వున్నాయి. ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన స్టెప్స్ మాస్ ఆడియన్స్‌ను అలరించేవిగా వున్నాయి. కోడికి సంతాపం తెలిపే పాటను మీరూ ఓ లుక్కేయండి.