Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విప్లవవీరుడు సినీ ఇండస్ట్రీని వీడాలి : బాహుబలి సంగీత దర్శకుడు

తెలుగు చిత్రపరిశ్రమలో విప్లవ వీరుడుగా గుర్తింపు పొందిన సినీ హీరో, దర్శక నిర్మాత ఆర్. నారాయణ మూర్తి గురించి బాహుబలి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అన్నదాత సుఖీభవ" సినిమా రీ-ర

Advertiesment
విప్లవవీరుడు సినీ ఇండస్ట్రీని వీడాలి : బాహుబలి సంగీత దర్శకుడు
, శుక్రవారం, 22 జూన్ 2018 (08:50 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో విప్లవ వీరుడుగా గుర్తింపు పొందిన సినీ హీరో, దర్శక నిర్మాత ఆర్. నారాయణ మూర్తి గురించి బాహుబలి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అన్నదాత సుఖీభవ" సినిమా రీ-రిలీజ్ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో కీరవాణి మాట్లాడుతూ, ఆర్.నారాయణ మూర్తి సినీ ఇండస్ట్రీని వీడి రాజకీయాల్లోకి రావాలంటూ పిలుపునిచ్చారు. అపుడే ఆయన అనుకున్నది సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి ఎవరెవరో వస్తున్నారని.. అన్నీ అర్హతలు ఉన్నా కూడా ఆయన ఎందుకు ఆ రంగంలోకి అడుగుపెట్టడం లేదని ప్రశ్నించారు. నారాయణ మూర్తి రాజకీయాల్లోకి రావడానికి నాలుగు అర్హతలు ఉన్నాయని.. వాటిని వివరించి మరీ చెప్పారు.
 
* భార్య, పిల్లలు, కుటుంబ బాధ్యతలు లేవు.
* నిరాడంబర జీవి. ఎలాంటి ఆర్భాటాలు కోరుకోరు. అతి సామాన్యంగా బతికేస్తారు.
* ప్రజల కోసమే సినిమాలు తీస్తారు.. ప్రజల సమస్యలపైనే మాట్లాడతారు.. నిత్యం సమాజం కోసం ఆలోచించే వ్యక్తి.
* ఆయన నడుస్తున్న గూగుల్. భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర, ఆర్థిక, సామాజిక అవగాహన ఉన్న వ్యక్తి. గూగుల్ లేకుండానే అన్నీ అనర్గళంగా చెప్పేస్తారు.
 
నిజానికి ఒక్క అర్హత ఉంటేనే రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా ప్రచారం చేసుకుంటున్నారు. అలాంటిది నాలుగు అర్హతలు ఉన్న ఆర్.నారాయణమూర్తి రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదని ప్రశ్నించారు. మార్పు రాజకీయాల ద్వారా సాధ్యం అని.. అధికారం అనే బెత్తం చేతిలో ఉంటుందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాజూకైన బాడీ కోసం తెల్లతోలు సుందరి యోగా ప్రాక్టీస్ (Video)