Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాజావారు రాణివారు' హీరో తదుపరి చిత్రం 'సమ్మతమే'

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (13:28 IST)
'రాజావారు రాణివారు' సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై ఆక‌ట్టుకున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్‌కు 'స‌మ్మ‌త‌మే' అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ చిత్రానికి గోపీనాథ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 
 
'క‌ల‌ర్ ఫొటో'లో హీరోయిన్‌గా త‌న క్యూట్ ప‌ర్ఫార్మెన్స్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన చాందిని చౌద‌రి ఈ చిత్రంలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం జోడీగా న‌టిస్తున్నారు. యు.జి. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కె. ప్ర‌వీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
సోమ‌వారం 'స‌మ్మ‌త‌మే' టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఓ యువ‌తి స్తంభానికి క‌ట్టేసి ఉంటే, వెనుక శ్రీ‌కృష్ణుడు క‌నిపిస్తున్నాడు. చాలా ఆహ్లాద‌క‌రంగా ఆక‌ట్టుకుంటోంది ఈ పోస్ట‌ర్‌. "ల‌వ్ ఈజ్ అన్‌కండిష‌న‌ల్" అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిట‌నే ఆస‌క్తి రేకెత్తుతోంది. స‌మ్మ‌త‌మే అంటే అంగీకారం అనే విష‌యం మ‌న‌కు తెలుసు.
 
ల‌వ్ డ్రామా మేళ‌వించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శేఖ‌ర్ చంద్ర సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, స‌తీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. విప్ల‌వ్ నైష‌దం ఎడిట‌ర్ కాగా, సుధీర్ మాచ‌ర్ల ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.
 
త్వ‌రర‌లో ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర వివ‌రాల‌ను చిత్ర బృందం వెల్ల‌డించ‌నున్న‌ది.
 
తారాగ‌ణం:
కిర‌ణ్ అబ్బ‌వ‌రం, చాందిని చౌద‌రి
 
సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, ద‌ర్శ‌క‌త్వం: గోపీనాథ్ రెడ్డి
నిర్మాత‌: కె. ప్ర‌వీణ‌
బ్యాన‌ర్‌: యు.జి. ప్రొడ‌క్ష‌న్స్‌
మ్యూజిక్‌: శేఖ‌ర్ చంద్ర‌
ఎడిటింగ్‌: విప్ల‌వ్ నైష‌దం
సినిమాటోగ్ర‌ఫీ: స‌తీష్ రెడ్డి మాసం
ఆర్ట్‌: సుధీర్ మాచ‌ర్ల‌
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments