సినీ రచయితల సంఘం తొలి సభ్యుడు, ఆయుర్వేద డాక్టర్ ఏల్చూరి వారసుడు ఏల్చూరి రంజిత్ కథానాయకుడిగా మారాడు. ఆయన నటిస్తున్న చిత్రం `ఏప్రిల్ 28 ఏమిజరిగింది`. శేర్రి అగర్వాల్ కథానాయిక. అజయ్, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వి జి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వీర స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర కథ సస్పెన్స్ థ్రిల్లర్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ నారా రోహిత్ విడుదల చేశారు.
హీరో కథలో రచయిత. తను రాసుకున్న కథను బట్టి ఓ భవంతిలోకి వెళ్ళగానే అక్కడ అతనికి జ్ఞాపకాలు గుర్తుకువ స్తాయి. అవి ఏమిటనేది చిత్రంలో చూడాల్సిందేనని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈనెలలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి పరుచూరి గోపాలకృష్ణ, హీరో శ్రీవిష్ణులు యూట్యూబ్ వీడియో మాట్లాడుతూ.. ఏల్చూరి వారసుడు తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
రామానాయుడు స్టూడియోలో ట్రైలర్ ఆవిష్కరణ అనంతరం నారా రోహిత్ మాట్లాడుతూ.. రంజిత్ నాకు మంచి స్నేహితుడు. హీరోగా మంచి సినిమాలో తెలుగులో ఆరంభించారు. థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ వుంటుంది. తప్పకుండా ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
రంజిత్ మాట్లాడుతూ... అవధి అనే కన్నడ సినిమా చేశాను. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది. ఇది 2వ సినిమా. తెలుగులో మొదటి సినిమా. నిర్మాత సినిమా ముందుకురావడానికి సహకరించారు. ఈ చిత్ర కథ చాలా భిన్నంగా వుంటుంది. గతంలో వచ్చిన థ్రిల్లర్‌ల కంటే ఆసక్తికరంగా వుంటుంది. దర్శకుడు మలిచిన తీరు అద్భుతంగా వుంది. ఈ జనవరిలో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.