Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ సోకి కన్నడ దర్శకుడు ప్రదీప్ రాజ్ మృతి

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (11:12 IST)
కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కరోనా వైరస్ సోకడం వల్ల దర్శకుడు ప్రదీప్ రాజ్ ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కరోనా వైరస్ సోకిన ఆయన్ను బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, గురువారం చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
అయితే, గత 15 సంవత్సరాలుగా ఆయన చక్కెర వ్యాధితో బాధపడుతూ వచ్చారు. దీనికితోడు కరోనా వైరస్ సోకడంతో అనారోగ్యం బాగా క్షీణించింది. ఫలితంగా ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని వైద్యులు వెల్లడించారు. ఇదిలావుంటే, ఆయన వయసు 46 యేళ్లు కాగా, భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు పుదుచ్చేరిలో జరుగనున్నాయి. 
 
ఈయన కేజీఎఫ్ హీరో యష్‌తో కలిసి కిచ్చా, కిరాతక వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రాలు యష్‌కు స్టార్ స్టేటస్‌ను తెచ్చిపెట్టాయి. అలాగే, గోల్డెన్ స్టార్ మిస్టర్, రజనీకాంత, సతీష్ నివాసం వంటి అనేక చిత్రాలు ఆయన తెరకెక్కించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments