Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kiara Advani: గుడ్ న్యూస్ చెప్పిన కియారా దంపతులు.. పాప సాక్స్ ఫోటోతో?

సెల్వి
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (20:15 IST)
Kiara Advani
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ గుడ్ న్యూస్ చెప్పింది. కియారా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పాప సాక్స్ ఫోటోను పోస్ట్ చేస్తూ ఈ శుభవార్తను పంచుకున్నారు. అలాగే "మా జీవితానికి సంబంధించిన అద్భుతమైన బహుమతి త్వరలోనే రానుంది" అంటూ రాసుకొచ్చింది. 
 
కియారా-సిద్ధార్థ్ తొలిసారి లస్ట్ స్టోరీస్ సినిమా ముగింపు పార్టీలో కలిశారు. ఈ పరిచయం మొదట స్నేహంగా, ఆ తర్వాత క్రమంగా ప్రేమగా మారింది. షేర్షా సినిమా సెట్స్‌లో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్‌లో చాలా వైభవంగా జరిగింది. 
 
ఇటీవలే రెండో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో తాను తల్లి కాబోతున్న విషయాన్ని కియారా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకా కియారాకు సెలెబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 
బాలీవుడ్ నటుడైన సిద్ధార్థ్ తదుపరి నటి జాన్వీ కపూర్‌తో కలిసి పరమ సుందరిలో కనిపించనున్నారు. వీరిద్దరూ కేరళ షెడ్యూల్‌ను ముగించారు. డిసెంబర్ 2024లో, మాడాక్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రకటించి, పరమ సుందరి ఫస్ట్ లుక్‌ను షేర్ చేసింది. ఈ చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహించారు.
 
ఈ చిత్రంలో సిద్ధార్థ్ పరమ్‌గా, జాన్వీ కపూర్ సుందరిగా నటించారు. ఈ చిత్రం కేరళలోని సుందరమైన బ్యాక్ వాటర్స్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ రొమాంటిక్ కామెడీ ఊహించని మలుపులతో కూడిన రోలర్ కోస్టర్‌గా ఈ మూవీ ఉంటుందని హామీ ఇస్తుంది. 
Kiara Advani
 
అలాగే కియారా చివరిసారిగా రామ్ చరణ్ నటించిన "గేమ్ ఛేంజర్"లో కనిపించింది. ఆమె తదుపరి యష్ నటించిన పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ చిత్రం "టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్"లో కనిపించనుంది. ఈ చిత్రానికి గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌లతో "వార్ 2" కూడా నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోడీ ట్వీట్

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి - ఏపీకి వర్ష సూచన

ఫేషియల్ చేయించుకుందని భార్య జట్టు కత్తిరించిన భర్త (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments