ఆ సీన్లు చేసిన తరువాత అవే గుర్తుకొస్తున్నాయి: కియారా అద్వాణీ

శనివారం, 19 అక్టోబరు 2019 (22:15 IST)
తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా కియారా అద్వాణీకి తెలుగు సినీ పరిశ్రమలో అభిమానులు ఎక్కువమందే ఉన్నారు. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాను హిందీ భాషలో చిత్రీకరించారు. హిందీ భాషలో హీరోయిన్ కియారా అద్వాణీ. ముద్దుసీన్లతో కైరా సినిమాకే హైలెట్‌గా నిలిచింది.
 
ఈ సినిమా కాస్తా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సినిమా విజయం తరువాత కియారా అద్వాణీ కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది. కబీర్‌తో కలిసి కొన్ని సీన్లలో నటించాను. ఆ సన్నివేశాలు ఇప్పటికీ నా మదిలో అలాగే ఉన్నాయి. గాఢప్రేమలో ఉన్న ఇద్దరు ప్రేమికుల కథ అది.
 
ఆ సినిమాలో హీరోతో నేను ప్రేమికురాలిగా నటించిన సన్నివేశాలు.. నా తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకోకపోవడం లాంటి సీన్లలో నటించాను. ఆ సీన్లు నా కళ్ళ ముందే మెదులుతున్నాయి. నిజ జీవితంలో ప్రేమికులిద్దరినీ కుటుంబ సభ్యులను విడదీస్తే పడే బాధ నాకు ఆ సన్నివేశాల్లో నటించేటప్పుడు అర్థమైంది అంటోంది కియారా. అలాంటి సీన్లను ఎప్పటికీ మర్చిపోవడం సాధ్యం కాదని చెబుతోంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం విక్ర‌మ్ 58 మూవీలో హీరోయిన్ ఎవ‌రు..?