Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విక్ర‌మ్ 58 మూవీలో హీరోయిన్ ఎవ‌రు..?

Advertiesment
విక్ర‌మ్ 58 మూవీలో హీరోయిన్ ఎవ‌రు..?
, శనివారం, 19 అక్టోబరు 2019 (21:52 IST)
ఇటీవల కన్నడ భాషలో తెరకెక్కిన కెజిఎఫ్ చాప్టర్ 1 సినిమా దేశ వ్యాప్తంగా పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వచ్చిన ఆ సినిమాలో రాక్ స్టార్ యాష్ సరసన శ్రీనిధి శెట్టి తొలిసారి హీరోయిన్‌గా పరిచయమై ఆకట్టుకునే అందం మరియు నటనతో ఆడియన్స్‌ని మెప్పించారు. 
 
ఇక ఆ సినిమాకు సీక్వెల్‌గా ప్రస్తుతం తెరకెక్కుతున్న కెజిఎఫ్ చాప్టర్ 2లో కూడా ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఆమెను చియాన్ విక్రమ్ నటించబోయే ఆయన 58వ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు ఆ సినిమా యూనిట్ నేడు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లలిత్ కుమార్ సమర్పణలో 7 స్క్రీన్ స్టూడియోస్, వయాకామ్ 18 పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 
 
ప్రఖ్యాత సంగీత దర్శకులు ఏ ఆర్ రహమాన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాలో మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజిల్ ట్రైల‌ర్ రెస్పాన్స్ ఏంటి..?